Shraddha Kapoor Is Floral Princess At Cousin Priyaank Sharma’s wedding Maldives Photos And Videos - Sakshi
Sakshi News home page

కజిన్‌ పెళ్లిలో బాలీవుడ్‌ బ్యూటీ సందడి

Published Mon, Mar 1 2021 7:24 PM | Last Updated on Mon, Mar 1 2021 9:31 PM

Shraddha Kapoor Cousin Priyaank Sharma, Shaza Morani Wedding Pics - Sakshi

(ఫొటో సేకరణ: ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌)

రెబర్‌ స్టార్‌ ప్రభాస్‌ సరసన 'సాహో'లో నటించి ఆకట్టుకున్న శ్రద్ధా కపూర్‌ ఆ మధ్య మాల్దీవ్స్‌కు వెళ్లింది. విహారయాత్రకో, రిలాక్స్‌ అవడానికో వెళ్లిందనుకుంటున్నారా? కానే కాదు, పెళ్లితంతు కోసం వెళ్లింది. క్షణం తీరిక లేకుండా పెళ్లి పనుల్లో, ఫొటోలు దిగడంలో చాలా బిజీ బిజీగా గడిపింది కూడా! అయితే ఆమె అంతగా లీనమైంది తన పెళ్లి పనుల్లో కాదులెండి.. తన కజిన్‌ వివాహ కార్యక్రమాల్లో. పద్మిని కొల్లాపూర్‌ తనయుడు ప్రియాంక్‌ శర్మ, నిర్మాత కరీమ్‌ మొరానీ కూతురు షాజా మొరానీ ఈ మధ్యే పెళ్లి చేసుకున్నారు. ఈ వేడుకకు మాల్దీవులు అంగరంగ వైభవంగా ముస్తాబైంది. ఇరు కుటుంబాలతో కజిన్లు శ్రద్ధా కపూర్‌, సిద్ధాంత్‌ కపూర్‌ సమక్షంలో ఈ పెళ్లి వైభవంగా జరిగింది.

తాజాగా ప్రియాంక్‌- మొరానీ ప్రీ వెడ్డింగ్‌, హల్దీ ఫంక్షన్‌ ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఇందులో వధూవరుల వెంటే ఉంటూ ఫొటోలకు పోజులిస్తున్న శ్రద్ధా పెళ్లి పనుల్లో మరింత చురుకుగా పాల్గొన్నట్లు కనిపిస్తోంది. ఇదిలా వుంటే బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధా కపూర్‌, ఫొటోగ్రాఫర్‌ రోహన్‌శ్రేష్ట ప్రేమించుకున్నట్లు కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఆ మధ్య ఈ వార్తలపై స్పందించిన శ్రద్ధా తండ్రి శక్తి కపూర్‌ రోహన్‌ చాలా మంచి వాడని చెప్తూనే వాళ్లు ఇప్పటికీ స్నేహితులు అనుకుంటున్నట్లు తెలిపాడు.

చదవండి: ఫొటోగ్రాఫర్‌తో సాహో హీరోయిన్‌ పెళ్లి?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement