జైపూర్ : ‘26/11 ముంబై దాడులు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే జరిగాయి. వాళ్ళ ప్రభుత్వ హయంలో జరిగిన దాడులను ఆపలేని వాళ్లే.. పాకిస్తాన్ ఉగ్రవాదులపై భారత జవానులు జరిపిన సర్జికల్ స్ట్రైక్స్‌కు ఆధారాలడుగుతున్నారు. జవానులు ఏదైనా ఆపరేషన్‌లో ఉన్నప్పుడు కెమెరాలు తీసుకువెళ్లి ఫొటోలకు పోజులిస్తారా? ఈ నాలుగేళ్లలో కశ్మీరులో అడుగుపెట్టిన ఏ ఉగ్రవాదైనా తప్పించుకోగలిగాడా? మా ప్రభుత్వం మావోయిస్టులు, ఉగ్రవాదుల సమస్యను తీవ్రంగా తీసుకుంది’అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కాంగ్రెస్‌ను విమర్శించారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ 7 న జరగనున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని మ్మురం చేశారు. ప్రచారంలో భాగంగా గిరిజన ప్రాంతమైన బాన్సవారలో నిర్వహించిన సభలో మోదీ కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. రాహుల్‌గాంధీ పేరును ప్రస్తావించకుండా గోల్డెన్ స్పూన్‌తో పుట్టిన వారసుడికి పేదప్రజల కష్టాలెలా తెలుస్తాయని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మావోయిస్టులకు ఉద్యమకారులని బిరుదులిస్తుందని, రాహుల్‌కు ఎన్‌సీసీ అంటే ఏమిటో తెలియదని, మానిఫెస్టో అంటే ఏమిటో కూడా తెలియని వ్యక్తి, మానససరోవరం వెళ్తారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Comments
Please login to add a commentAdd a comment