ఇటీవల రాజస్థాన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆ ప్రచారంలో మోదీ చేసిన వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పలు స్థానాల్లో పార్టీ ఓడిపోతుందంటూ బికనీర్ బీజేపీ మైనారిటీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఉస్మాన్ ఘనీ వ్యాఖ్యానించారు. దీంతో క్రమశిక్షణారాహిత్యం కింద ఉస్మాన్ ఘనీని పార్టీ నుంచి బహిస్కరిస్తూ బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది.
ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన ఓ ఛానెల్‌లో ఇంటర్వ్యూలో ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యల్ని ఉస్మాన్ ఘని ఖండించారు.అంతేకాదు 25 స్థానాల్లో పలు స్థానాల్లో బీజేపీ ఓడిపోతుందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఉస్మాన్ ఘనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
బీజేపీ ప్రతిష్టను దిగజార్చేందుకు ఉస్మాన్ ఘనీ ప్రయత్నించారని బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణా కమిటీ చైర్మన్ ఓంకార్ సింగ్ లఖావత్ అన్నారు. పార్టీ ప్రతిష్టను దిగజార్చడానికి ఉస్మాన్ ఘనీ చేసిన చర్యను పార్టీ గుర్తించింది. క్రమశిక్షణ ఉల్లంఘనగా భావించి పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి ఆరేళ్లపాటు అతన్ని బహిష్కరించింది అని లఖావత్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment