
విజయవాడ: పారిశ్రామికవేత్త రాహుల్ హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న కోగంటి సత్యంను పోలీసులు విజయవాడ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. అంతకముందు కేసులో ఏ-2గా ఉన్న కోగంటి సత్యంను బెంగళూరులో అరెస్ట్ చేశారు. కాగా విజయవాడ విడిచివెళ్లొదంటూ రెండు రోజుల క్రితం కోగంటి సత్యంకు పోలీసులు నోటీసులు అందించారు. తాను విజయవాడలోనే ఉంటానని.. ఎప్పుడు పిలిచినా వస్తానని కోగంటి సత్యం పోలీసులకు వివరించాడు. అయితే సోమవారం మధ్యాహ్నం కోగంటి సత్యం విజయవాడ నుంచి బెంగళూరుకు వెళ్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
దీంతో అప్రమత్తమై విజయవాడ మాచవరం పోలీసులు బెంగళూరు పోలీసులకు సమాచారం అందించగా.. సత్యంను బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లోనే అరెస్టు చేసి దేవనపల్లి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు.