Cricketer Rahul Sharma Review On Pushpa: Calls Allu Arjun As Mega Star Tweet Goes Viral - Sakshi
Sakshi News home page

Pushpa: మెగాస్టార్‌ అల్లు అర్జున్‌ మరో లెవల్‌ అంటున్న క్రికెటర్‌

Published Wed, Jan 5 2022 11:37 AM | Last Updated on Wed, Jan 5 2022 1:18 PM

Cricketer Rahul Sharma Review On Pushpa: Calls Allu Arjun As Mega Star - Sakshi

'పుష్ప అంటే ఫ్లవర్‌ అనుకుంటివా ఫైరూ..', 'పుష్ప.. పుష్పరాజ్‌.. తగ్గేదేలే..' ఎక్కడ చూసినా ఈ పుష్ప డైలాగులు, పాటలు మార్మోగిపోతున్నాయి. సౌత్‌ ,నార్త్‌ తేడా లేకుండా అంతటా పుష్ప ‍ప్రభంజనమే కనిపిస్తోంది. సినిమా వచ్చి 20 రోజులవుతున్నా దాని క్రేజ్‌ మాత్రం ఇసుమంతైనా తగ్గలేదు. బాక్సాఫీస్‌ దగ్గర కలెక్షన్ల మోత మోగిస్తున్న ఈ సినిమాను ఈ మధ్యే టీమిండియా ఆటగాళ్లు వీక్షించిన విషయం తెలిసిందే.

తాజాగా మరో ఇండియన్‌ క్రికెటర్‌ రాహుల్‌ శర్మ 'పుష్ప' చిత్రాన్ని వీక్షించాడు. ఇదే విషయాన్ని ఆయన ట్విటర్‌లో వెల్లడించాడు. 'పుష్ప సినిమా చూశాను. మొదటిసారి దక్షిణాది చిత్రం చూసి అద్భుతంగా ఫీలయ్యాను. మరీ ముఖ్యంగా మెగాస్టార్‌ అల్లు అర్జున్‌ మరో లెవల్‌లో కనిపించాడు. రష్మిక మందన్నా కూడా అదరగొట్టేసింది. పుష్ప టీమ్‌ మొత్తానికి శుభాకాంక్షలు' అని రాసుకొచ్చాడు. ఇది చూసిన బన్నీ.. 'పుష్ప చిత్రం మీకు నచ్చినందుకు సంతోషంగా ఉంది. మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు' అంటూ రిప్లై ఇచ్చాడు. అయితే ఇది చూసిన సినీప్రియులు మాత్రం ఈయనేంటి? బన్నీని మెగాస్టార్‌ అని పిలిచాడు? అంటూ కామెంట్లు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement