రహుల్, కావ్య థాపర్
ఫైట్‌మాస్టర్ విజయ్ తనయుడు రహుల్ హీరోగా కావ్య థాపర్ హీరోయిన్‌గా రాము కొప్పుల దర్శకత్వంలో వి.ఎస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై దివ్య విజయ్ నిర్మాతగా ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర టాకీ పార్ట్ కంప్లీట్ అయ్యింది. దర్శకుడు రాము మాట్లాడుతూ– ‘‘టాకీ పార్ట్ అనుకున్న విధంగా కంప్లీట్ అయింది. రాహుల్ బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయే కథ. అద్భుతంగా నటించాడు. మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు’’ అన్నారు.
నిర్మాత దివ్య విజయ్ మాట్లాడుతూ –‘‘దర్శకుడు చాలా బాగా తెరకెక్కించాడు.లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా అందర్ని ఆకట్టుకుంటుంది. రాహుల్, కావ్య పెయిర్ స్క్రీన్‌పై చాలా బావుంది. మణిశర్మ సంగీతం, శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ అవుతాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు త్వరలోనే స్టార్ట్ చేస్తాం’’ అని అన్నారు. రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మ, పవిత్రా లోకేష్ తదితరులు నటించిన ఈ సినిమాకు లైన్ ప్రొడ్యూసర్: రాజు ఓలేటి.
Comments
Please login to add a commentAdd a comment