
ఢిల్లీలో ఇవాళ గణతంత్ర వేడుకలు జరుగుతున్నాయి. ఢిల్లీలోనే అనేముందీ.. దేశమంతటా రిపబ్లిక్ డేనే కదా! అవుననుకోండీ, ఈసారి ఢిల్లీ సెలబ్రేషన్స్ కొంచెం డిఫరెంట్‌గా జరుగుతున్నాయి. రాహుల్ గాంధీకి స్టేజీకి దూరంగా వెనక ఎక్కడో నాలుగో వరుసలో సీటువేసి కూర్చోబెట్టి ఆయనకు వివిధ దళాల విన్యాసాలను చూపించాలని మోదీ డిసైడ్ చేశారు! కాంగ్రెస్ ప్రెసిడెంట్ సీటు ప్రతి రిపబ్లిక్ డేకి ప్రముఖులతో పాటు ముందు వరుసలో ఉంటుంది. రాహుల్ ప్రెసిడెంట్ అయ్యాక మోదీ ఆ సంప్రదాయాన్ని మార్చేశారు! ‘‘అబ్బే ఆయనకేం తెలీదు పాపం’’ అని బీజేపీ అంటుంటే... ‘‘అవును పాపం. మోదీకి ఏ పాపమూ తెలీదు. రాహుల్‌బాబుని అవమానించడానికి పుణ్యం కట్టుకుంది మాత్రం మోదీనే’’ అని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారు.
‘‘ఇందులో అవమానించడానికి ఏముందీ.. వీఐపీలకు సీట్లు సరిపోకనే అలా సెట్ చేశాం’’ అని బీజేపీ అంటోంది. ఇంతకీ ఎవరా వీఐపీలు? ఆసియన్ దేశాల నుంచి వచ్చిన పదిమంది ప్రతినిధులట. వాళ్లను గౌరవించినట్లూ ఉంటుందనీ, రాహుల్‌ను అవమానించినట్లూ ఉంటుందని ఇలా రాహుల్‌కి బ్యాక్ సీట్ వేయించిన ట్లున్నారు మోదీ! ఒకటి మాత్రం తేల్లేదు. వాళ్లను గౌరవించడానికి ఈయన్ని అవమానించారా? ఈయన్ని అవమానించడానికి వాళ్లను గౌరవించారా?
Comments
Please login to add a commentAdd a comment