
'చంపుతా, పాతరేస్తానన్న సస్పెండ్ చేయలేదు'
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సంప్రదాయాలను అధికారపక్షం తుంగలో తొక్కిందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విమర్శించారు. మంగళవారం తిరుపతిలో జరిగిన అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ కమిటీ సమావేశంలో చెవిరెడ్డి మాట్లాడారు. అసెంబ్లీ పోడియం వద్ద వైఎస్సార్‌సీపీ నగరి ఎమ్మెల్యే రోజా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. రికార్డులో లేని మాటలను సాకుగా చూపి ఏడాదిపాటు సస్పెండ్ చేశారని మండిపడ్డారు.
అంతేకాక వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను చంపుతా, పాతరేస్తానన్న టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమమహేశ్వరరావును ఒక్క రోజు కూడా సస్పెండ్ చేయలేదని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.