assembly Ethics committee
-
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ సభ్యుడిగా అనంత
సాక్షి, అనంతపురం: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎథిక్స్ కమిటీ సభ్యుడిగా అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఎన్నికయ్యారు. అంబటి రాంబాబు చైర్మన్గా ఏడుగురి సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయగా...అందులో ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డికి చోటు కల్పిస్తూ ఏపీ స్టేట్ లెజిస్లేచర్ సెక్రటరీ బాలకృష్ణమాచార్యులు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ‘అనంత’ కుటుంబం ఐదు దశాబ్దాలుగా జిల్లా రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేస్తోంది. నాలుగుసార్లు ఎంపీగా పనిచేసిన అనంత వెంకటారామిరెడ్డి... తన హయాంలో జిల్లా అభివృద్ధికి విశేష కృషి చేశారు. కేంద్రంతో పాటు రాష్ట్రం నుంచి నిధులు రాబట్టి అభివృద్ధి బాటలు వేశారు. ఈయన తండ్రి అనంత వెంకటరెడ్డి రెండుసార్లు ఎంపీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా పని చేశారు. అనంత వెంకటరామిరెడ్డికి ఎథిక్స్ కమిటీ సభ్యుడిగా అవకాశం కల్పించడంతో పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. -
'చంపుతా, పాతరేస్తానన్న సస్పెండ్ చేయలేదు'
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సంప్రదాయాలను అధికారపక్షం తుంగలో తొక్కిందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విమర్శించారు. మంగళవారం తిరుపతిలో జరిగిన అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ కమిటీ సమావేశంలో చెవిరెడ్డి మాట్లాడారు. అసెంబ్లీ పోడియం వద్ద వైఎస్సార్సీపీ నగరి ఎమ్మెల్యే రోజా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. రికార్డులో లేని మాటలను సాకుగా చూపి ఏడాదిపాటు సస్పెండ్ చేశారని మండిపడ్డారు. అంతేకాక వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను చంపుతా, పాతరేస్తానన్న టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమమహేశ్వరరావును ఒక్క రోజు కూడా సస్పెండ్ చేయలేదని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
'స్పీకర్ స్థానం ముళ్లకిరీటం లాంటింది'
తిరుపతి: అసెంబ్లీలో స్పీకర్ స్థానం ముళ్లకిరీటం లాంటిదని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అభిప్రాయపడ్డారు. తిరుపతిలో మంగళవారం అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశం ముగిసిన అనంతరం కోడెల విలేకరులతో మాట్లాడారు. సభలో ప్రతి సభ్యుడు బాధ్యతగా వ్యహరించాలని ఆయన సూచించారు. అప్పుడే అర్థవంతమైన చర్చ జరిగి ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పారు. సభలో జరిగిన పరిణామాలపై మేధావుల అభిప్రాయాలు సేకరిస్తున్నామని కోడెల పేర్కొన్నారు.