
'స్పీకర్ స్థానం ముళ్లకిరీటం లాంటింది'
తిరుపతి: అసెంబ్లీలో స్పీకర్ స్థానం ముళ్లకిరీటం లాంటిదని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అభిప్రాయపడ్డారు. తిరుపతిలో మంగళవారం అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశం ముగిసిన అనంతరం కోడెల విలేకరులతో మాట్లాడారు. సభలో ప్రతి సభ్యుడు బాధ్యతగా వ్యహరించాలని ఆయన సూచించారు.
అప్పుడే అర్థవంతమైన చర్చ జరిగి ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పారు. సభలో జరిగిన పరిణామాలపై మేధావుల అభిప్రాయాలు సేకరిస్తున్నామని కోడెల పేర్కొన్నారు.