
సాక్షి, అనంతపురం: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎథిక్స్ కమిటీ సభ్యుడిగా అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఎన్నికయ్యారు. అంబటి రాంబాబు చైర్మన్‌గా ఏడుగురి సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయగా...అందులో ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డికి చోటు కల్పిస్తూ ఏపీ స్టేట్ లెజిస్లేచర్ సెక్రటరీ బాలకృష్ణమాచార్యులు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ‘అనంత’ కుటుంబం ఐదు దశాబ్దాలుగా జిల్లా రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేస్తోంది.
నాలుగుసార్లు ఎంపీగా పనిచేసిన అనంత వెంకటారామిరెడ్డి... తన హయాంలో జిల్లా అభివృద్ధికి విశేష కృషి చేశారు. కేంద్రంతో పాటు రాష్ట్రం నుంచి నిధులు రాబట్టి అభివృద్ధి బాటలు వేశారు. ఈయన తండ్రి అనంత వెంకటరెడ్డి రెండుసార్లు ఎంపీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా పని చేశారు. అనంత వెంకటరామిరెడ్డికి ఎథిక్స్ కమిటీ సభ్యుడిగా అవకాశం కల్పించడంతో పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment