aide arrested
-
అర్థరాత్రి యార్లగడ్డ అనుచరుల వీరంగం, యువకులపై..
ఎన్టీఆర్, సాక్షి: రాష్ట్రంలో ఎన్నికల ఓటమిని ముందుగానే పసిగట్టి అల్లర్లు, హింసాత్మక ఘటనలకు ప్రతిపక్ష టీడీపీ ప్రణాళిక రచిస్తోంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో పచ్చ మూక బరి తెగిస్తోంది. వైఎస్సార్సీపీకి సానుభూతిపరుల్ని వెతుక్కుంటూ వెళ్లి మరీ దాడులకు తెగబడుతోంది. ఈ క్రమంలోనే గన్నవరంలో యువకులపై దాడి జరిగింది. ఈ దాడికి పాల్పడింది యార్లగడ్డ వెంకట్రావు అనుచరులుగా తేలింది.గన్నవరం మండలం మర్లపాలెం శివారులో ఇంట్లో నిద్రిస్తున్న ఇద్దరు యువకులపై దాడి కలకలం రేపింది. రాత్రిపూట అపార్ట్మెంట్ తలుపుల్ని బద్ధలు కొట్టుకుని వెళ్లి మరీ యువకులను చితకబాదారు. ఆపై బలవంతంగా తమ కారులో ఎక్కించుకెళ్లి వాళ్లను చిత్రహింసలకు గురి చేశారు. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ దృశ్యాలు బయటకు వచ్చాయి.ఇద్దరు యువకులపై దాడి చేసింది గన్నవరం టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు అనుచరులుగా పోలీసులు గుర్తించారు. టీడీపీ నేతలు ఫణి రెడ్డి, పౌలూరి వంశీకృష్ణ, కంభంపాటి దేవేంద్ర, కంభంపాటి బాలనరేష్, దేవినేని హర్షచౌదరి, శొంఠి సురేష్, కన్నా కార్తిక్, బాబీ, కంఠమనేని అరుణకు మార్, మరి కొంత మంది ఉన్నట్టు గుర్తించారు. దాడి ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
గీతాంజలి కేసులో ఇద్దరి అరెస్ట్
సాక్షి, గుంటూరు: సోషల్ మీడియా ట్రోలింగ్‌తో బలవనర్మణానికి పాల్పడిన గీతాంజలి కేసులో అరెస్టుల పర్వం మొదలైంది. పసుమర్తి రాంబాబు అనే వ్యక్తిని తెనాలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాంబాబు టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావుకు అనుచరుడిగా తెలుస్తోంది. దుర్గారావు అనే మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జగనన్న పాలనలో తనకు మంచి జరిగిందంటూ ఇంటి పట్టా అందుకున్న ఆనందంలో గీతాంజలి ఓ ప్రైవేట్ ఇంటర్వ్యూలో భావోద్వేగానికి లోనైంది. అయితే ఆ వీడియోను ఉద్దేశపూర్వకంగా సోషల్‌మీడియాలో పోస్ట్ చేసి.. ఆమెను అతిదారుణంగా ట్రోల్ చేశారు. దీంతో.. తీవ్ర మనోవేదనకు గురైన ఆమె రైలు కింద పడి ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే గాయాలతో ఉన్న ఆమెను ఆస్పత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన ఏపీలో తీవ్ర దుమారం రేపింది. సోషల్ మీడియాలో వేధించిన సైకోలను వదల్లొద్దంటూ డిమాండ్ బలంగా వినిపించింది. ఏపీ పోలీసులు కూడా ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. దర్యాప్తు ముమ్మరం చేసి.. పసుమర్తి రాంబాబును అరెస్ట్ చేశారు. గీతాంజలిపై రాంబాబు సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెట్టినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో రాంబాబును అదుపులోకి తీసుకుని తెనాలి స్టేషన్‌కు తరలించారు. దుర్గారావు అనే మరో వ్యక్తి గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు గీతాంజలిపై అనుచిత పోస్టులు పెట్టిన టీడీపీ, జనసేన నేతల అకౌంట్ల పరిశీలన జరుగుతోందని పోలీసులు చెబుతున్నారు. చాలామంది పోస్టులు డిలీట్ చేసినప్పటికీ.. స్క్రీన్ షాట్లను పరిశీలించాక వాళ్లపై చర్యలు ఉంటాయని.. అలాగే పరారీలో ఉన్న మరికొందరిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెబుతున్నారు పోలీసులు. -
వికాస్ దుబే ప్రధాన అనుచరుడు అరెస్ట్
సాక్షి, ముంబై : ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల ఎనిమిది మంది పోలీసు సిబ్బంది హత్య ఘటనలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్కౌంటర్లో హతమైన వికాస్ దుబే ముఖ్య అనుచరుడు, ఈ కేసులో మరో ప్రధాన నిందితుడు పోలీసులకు చిక్కాడు. అరవింద్ రామ్ విలాస్ త్రివేది (46), అలియాస్ గుద్దాన్ను ముంబై ఏటీఎస్ బృందం శనివారం అరెస్టు చేసింది. ఇతనితోపాటు, డ్రైవర్ సుశీల్‌కుమార్ సురేష్ తివారీ (30) అలియాస్ సోను కూడా థానేలోని కోల్షెట్ రోడ్ లో అదుపులోకి తీసుకున్నట్టు అధికారులు ప్రకటించారు. కాన్పూర్ సమీపంలోని బిక్రూ గ్రామంలో పోలీసులు హత్య తరువాత త్రివేది తన డ్రైవర్‌తో పాటు రాష్ట్రం నుంచి పారిపోయినట్టుగా విచారణలో తేలిందని అధికారులు వెల్లడించారు. 2001లో ఉత్తరప్రదేశ్ మంత్రి సంతోష్ శుక్లా హత్యతో సహా దుబేతో పాటు త్రివేది అనేక కేసుల్లో నిందితుడని పేర్కొన్నారు. అలాగే త్రివేది అరెస్టుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గతంలో బహుమతిని ప్రకటించిందని ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, పోలీసు అధికారి దయా నాయక్ చెప్పారు. (ఇలాంటి చావుకు దుబే అర్హుడే: రిచా) కాగా పోలీసులపై దాడిచేసి డీఎస్పీ, ముగ్గురు ఎస్ఐలు సహా ఎనిమిది మంది హత్యలకు కారణమైన కరుడగట్టిన నేరస్థుడు వికాస్ దూబేను ఎన్కౌంటర్లో యూపీపోలీసులు హతమార్చిన విషయం తెలిసిందే. (దుబే హతం) -
ముంబైలో దావూద్ అనుచరుడి అరెస్ట్
ముంబై : అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు రామ్‌దాస్ రహానేను ముంబై పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. దావూద్ గ్యాంగ్‌కి చెందిన రహానే పాకిస్తాన్‌లోని సహాచరుల ఆదేశాల మేరకు ఓ హోటల్ యాజమానిపై బెదిరింపులకు పాల్పడినందుకు ముంబై యాంటి ఎక్స్టార్షన్ సెల్(ఏఈసీ) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ హోటల్ యాజమానికి ఫోన్ చేసిన రహానే.. 50 లక్షలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశాడు. అంతేకాకుండా 5 లక్షలు వెంటనే అందజేయాలని హెచ్చరించాడు. దీంతో హోటల్ యాజమాని పోలీసులను ఆశ్రయించాడు. తనకు పాకిస్తాన్ నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నట్టు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు ఇందులో రహానే హస్తం ఉన్నట్టు నిర్ధారణకు వచ్చారు. సంగమనేరులోని రహానే ఇంటిపై దాడి చేసిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడంతో పాటు ఓ తుపాకిని, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్ట్‌పై డీసీసీ దిలీప్ సావంత్ మాట్లాడుతూ.. రహానే దావూద్ గ్యాంగ్‌లోని ముఖ్య సభ్యులలో ఒకరని తెలిపారు. హోటల్ యాజమాని ఫిర్యాదు మేరకు రహానేను అరెస్ట్ చేశామన్నారు. రహానేపై 11 సీరియస్ కేసులున్నట్టు వెల్లడించారు. 2011లో ప్రముఖ బిల్డర్ మనీష్‌పై చర్చిగేట్ సమీపంలో జరిగిన దాడిలో రహానే ప్రధాన పాత్ర పోషించాడని పేర్కొన్నారు. 2017లో దావూద్ సోదరుడు అనీస్ ఇబ్రహీం ఆదేశాల మేరకు జామ్‌నగర్‌కు చెందిన వ్యాపారి హత్యకు ఒప్పందం కుదుర్చుకున్నందుకు రహానేతో పాటు మరో ఆరుగురిని అరెస్ట్ చేసినట్టు చెప్పారు. -
జకీర్ నాయక్ ప్రధాన అనుచరుడి అరెస్టు
శాంతి ప్రవచనాలు వల్లిస్తున్నాంటూ చెప్పుకొనే పీస్ టీవీ వ్యవస్థాపకుడు జకీర్ నాయక్ సన్నిహిత అనుచరుడిని మహారాష్ట్ర ఏటీఎస్, కేరళ పోలీసులు జాయింట్ ఆపరేషన్‌లో అరెస్టు చేశారు. అర్షిద్ ఖురేషీ అనే ఈ యువకుడికి జకీర్ నాయక్ నడిపించే ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఐఆర్ఎఫ్)తో సంబంధాలున్నాయని, అతడిని నవీ ముంబై ప్రాంతంలో అరెస్టు చేశారని తెలిసింది. కేరళ యువకులను ఇస్లామిక్ స్టేట్‌లో నియమిస్తున్నాడన్న ప్రధాన ఆరోపణతో ఖురేషీని అరెస్టు చేసినట్లు జాతీయ మీడియా కథనాలను బట్టి తెలుస్తో ంది. ఖురేషి మీద ఐపీసీ సెక్షన్లు 153ఎ, 34లతో పాటు 13యూఏపీఏ కింద కేసులు పెట్టారు. ఖురేషీకి ఐఆర్ఎఫ్తో సంబంధాలు పర్తిగా బయటపడితే.. జకీర్ నాయక్ సంస్థ గుట్టు మొత్తం బయటపడుతుంది. ఖురేషీని మహారాష్ట్ర ఏటీఎస్ పోలీసులు ప్రశ్నించిన తర్వాత అతడిని కేరళకు తీసుకెళ్తారు.