
వికాస్ దుబే, అరవింద్ త్రివేది (ఫైల్ ఫోటో)
సాక్షి, ముంబై : ఉత్తరప్రదేశ్లో ఇటీవల ఎనిమిది మంది పోలీసు సిబ్బంది హత్య ఘటనలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్‌కౌంటర్‌లో హతమైన వికాస్ దుబే ముఖ్య అనుచరుడు, ఈ కేసులో మరో ప్రధాన నిందితుడు పోలీసులకు చిక్కాడు. అరవింద్ రామ్ విలాస్ త్రివేది (46), అలియాస్ గుద్దాన్‌ను ముంబై ఏటీఎస్ బృందం శనివారం అరెస్టు చేసింది. ఇతనితోపాటు, డ్రైవర్ సుశీల్‌కుమార్ సురేష్ తివారీ (30) అలియాస్ సోను కూడా థానేలోని కోల్షెట్ రోడ్ లో అదుపులోకి తీసుకున్నట్టు అధికారులు ప్రకటించారు.
కాన్పూర్ సమీపంలోని బిక్రూ గ్రామంలో పోలీసులు హత్య తరువాత త్రివేది తన డ్రైవర్‌తో పాటు రాష్ట్రం నుంచి పారిపోయినట్టుగా విచారణలో తేలిందని అధికారులు వెల్లడించారు. 2001లో ఉత్తరప్రదేశ్ మంత్రి సంతోష్ శుక్లా హత్యతో సహా దుబేతో పాటు త్రివేది అనేక కేసుల్లో నిందితుడని పేర్కొన్నారు. అలాగే త్రివేది అరెస్టుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గతంలో బహుమతిని ప్రకటించిందని ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్, పోలీసు అధికారి దయా నాయక్ చెప్పారు. (ఇలాంటి చావుకు దుబే అర్హుడే: రిచా)
కాగా పోలీసులపై దాడిచేసి డీఎస్పీ, ముగ్గురు ఎస్ఐలు సహా ఎనిమిది మంది హత్యలకు కారణమైన కరుడగట్టిన నేరస్థుడు వికాస్ దూబేను ఎన్‌కౌంటర్‌లో యూపీపోలీసులు హతమార్చిన విషయం తెలిసిందే. (దుబే హతం)
Comments
Please login to add a commentAdd a comment