స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్
హైదరాబాద్: సెయింట్ పాల్స్ వార్షిక టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్‌లో బాలికల టీమ్ విభాగంలో గీతాంజలి దేవర్షల, బీవీబీ జట్లు ఫైనల్‌కు చేరాయి. శనివారం జరిగిన సెమీఫైనల్లో గీతాంజలి దేవర్షల జట్టు 3-0తో గీతాంజలి జట్టుపై విజయం సాధించగా... బీవీబీ జట్టు 3-2తో ఎస్‌పీహెచ్‌ఎస్ జట్టును ఓడించి తుదిపోరుకు అర్హత సాధించాయి.
సబ్ జూనియర్ బాలుర రెండో రౌండ్ ఫలితాలు
వంశీ 3-0తో రిత్విక్‌పై, అద్వైత్ 3-0తో కమల్‌పై, విశాల్ 3-1తో ప్రణవ్‌పై, సాయి ధనుష్ 3-1తో రఘుపై, కార్తీక్ 3-0తో రిత్విక్ ఉప్పులూరిపై, సాయినాథ్ 3-2తో కేశవన్ కన్నన్‌పై, రితేశ్ 3-0తో యశ్ చంద్రపై గెలుపొందారు.
క్యాడెట్ బాలుర రెండో రౌండ్ ఫలితాలు
క్రిష్ 11-4,11-5, 13-11తో పార్థ్‌పై, త్రిశూల్ 11-6, 11-7, 13-11తో క్రిష్‌పై, శ్రేష్ట్ 11-6, 11-7, 11-9తో ఆయూష్‌పై, అథరిక్ 11-6, 11-8, 11-4తో తరుణ్‌పై, వేణుమాధవ్ 11-4, 11-6, 11-9పై, కుష్ 11-4, 13-11, 11-5తో రోనక్‌పై, రిత్విక్ 11-3, 11-7, 11-2తో వివేక్‌పై విజయం సాధించారు.