
‘దిల్’ రాజు యాక్టింగ్!
నిర్మాతలు అప్పుడప్పుడూ తెరపై కనిపించడం సర్వసాధారణం. రామానాయుడు తను నిర్మించిన చాలా సినిమాల్లో కొన్ని పాత్రలు పోషించారు. అలాగే, ఎమ్మెస్ రాజు కూడా కొన్ని సిని మాల్లో కనిపించారు. ఇలా చాలామంది నిర్మాతలు అప్పుడప్పుడూ తెరపై అతిథి పాత్రలు పోషించారు. ఇప్పుడా జాబితాలో ‘దిల్’ రాజు కూడా చేరారు. అయితే, ఆయన సొంత సినిమాలో కాకుండా బయటి సినిమాలో నటించడం విశేషం. అంజలి ప్రధాన పాత్రలో కోన వెంకట్ సమర్పణలో రూపొందిన ‘గీతాంజలి’ చిత్రంలో ఓ సన్నివేశంలో ఆయన పాత్ర ఆయనే చేశారు. నిర్మాత ‘దిల్’ రాజుగానే ఆయన ఇందులో కనిపిస్తారు.