
కమెడియన్ గా, సహాయ పాత్రల్లో బిజీగా ఉన్న శ్రీనివాస్ రెడ్డి హీరోగానూ ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు. గీతాంజలి సినిమాతో హీరోగా మారిన శ్రీనివాస్ రెడ్డి, జయమ్ము నిశ్చయమ్మురా సినిమాతో కథానాయకుడిగా మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. తరువాత కమెడియన్ గా బిజీ అవ్వటంతో హీరో పాత్రలకు కొద్ది రోజులు దూరంగా ఉన్న శ్రీనివాస్ రెడ్డి మరోసారిర హీరో అవతారం ఎత్తేందుకు రెడీ అవుతున్నాడు.
సుమంత్ అశ్విన్ హీరోగా రైట్ రైట్ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు మను డైరెక్షన్ లో శ్రీనివాస్ రెడ్డి హీరోగా ఓ సినిమా రూపొందనుంది. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతున్న ఈ సినిమాకు గోపిసుందర్ సంగీతమందించనున్నాడు. త్వరలోనే పూర్తి వివరాలతో అధికారిక ప్రకటన వెలువడనుంది. హీరోగా అవకాశాలు వస్తున్నా... సహాయపాత్రల్లోనూ కొనసాగుతూ సత్తా చాటుతున్నాడు శ్రీనివాస్ రెడ్డి.
Comments
Please login to add a commentAdd a comment