'గీతాంజలి' దర్శకుడు రాజ్కిరణ్ కి గుండెపోటు | Geethanjali movie director rajkiran gets heart attack | Sakshi
Sakshi News home page

'గీతాంజలి' దర్శకుడు రాజ్కిరణ్ కి గుండెపోటు

Published Tue, Aug 5 2014 11:12 AM | Last Updated on Thu, Sep 27 2018 8:55 PM

'గీతాంజలి' దర్శకుడు రాజ్కిరణ్ కి గుండెపోటు - Sakshi

'గీతాంజలి' దర్శకుడు రాజ్కిరణ్ కి గుండెపోటు

హైదరాబాద్ : హీరోయిన్ అంజలి ప్రధాన పాత్రలో  రూపొందిన 'గీతాంజలి' చిత్ర దర్శకుడు రాజ్కిరణ్ గుండెపోటుకు గురయ్యారు. దాంతో ఆయన్ని కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం మెహదీపట్నంలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. సినిమా విడుదల విషయంలో జాప్యం జరిగే పరిస్థితి కనిపిస్తుండటంతో ఒత్తిడికి గురైన రాజ్కిరణ్ ఈరోజు ఉదయం సొమ్మసిల్లి పడిపోయినట్లు తెలుస్తోంది. కాగా కమెడియన్ శ్రీనివాసరెడ్డి ఈ సినిమాతో హీరోగా మారారు. రాజ కిరణ్ దర్శకత్వంలో సినీ రచయిత కోన వెంకట్ సారధ్యంలో  ఈ చిత్రం తెరకెక్కింది. గీతాంజలి సినిమా ఈ నెల 8న విడుదల కానున్న విషయం తెలిసిందే.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement