మణిరత్నం
దర్శకుడు మణిరత్నంకు గురువారం గుండెపోటు వచ్చింది. చెన్నై గ్రీమ్స్ రోడ్డులోని అపోలో ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లోనే కాదు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు మణిరత్నం. ప్రస్తుతం మల్టీస్టారర్ మూవీ ‘చెక్క చివంద వానమ్’ రూపొందించారు.
ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, శింబు, అరవింద్ స్వామి, అరుణ్ విజయ్, జ్యోతిక ముఖ్య తారలుగా రూపొందిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లో మణిరత్నం బిజీగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో గురువారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో ఆయన ఆఫీస్‌లో ఉండగా గుండెపోటుకు లోనయ్యారు. తక్షణం అక్కడి సిబ్బంది, కుటుంబీకులు గ్రీమ్స్ రోడ్డులోని అపోలో ఆçస్పత్రికి తర లించారు. అక్కడ వైద్యులు ఆయనకు పరీక్షలు చేస్తున్నారు. ‘‘ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’’ అని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment