ఎల్విస్ గిటారుకు రూ.2.25 కోట్లు
న్యూయార్క్: సంగీత ప్రపంచంలో రాక్ అండ్ రోల్ రారాజుగా పేరొందిన అమెరికన్ గాయకుడు, నటుడు ఎల్విస్ ప్రెస్లీకి చెందిన గిటారు న్యూయార్క్‌లో జరిగిన వేలంలో రికార్డుస్థాయిలో రూ.2. 25కోట్లకు అమ్ముడుపోయింది. 1969లో ఎల్విస్ ఆయన తండ్రి దీనిని బహూకరించారు. ఆ తర్వాత 1975లో ఓ అభిమానికి ఎల్విస్ దీన్ని కానుకగా ఇచ్చాడు.
జూలియన్‌సంస్థ నిర్వహించిన ఇదే వేలంలో గాయకుడు మైఖేల్ జాక్సన్ కోటు రూ.1.72 కోట్ల ధర పలికింది. బీటిల్స్ బ్యాండ్ సహ వ్యవస్థాపకుడు, సంగీతకళాకారుడు జాన్ లెనిన్ స్వదస్తూరితో రాసిన పాట రూ.2.38కోట్లకు అమ్ముడుపోయింది.