'శృతి రాణే సింగర్, మ్యూజిక్ కంపోజర్. స్కూలు రోజుల నుంచి పాటలు పాడేది శృతి. స్థానికంగా జరిగే పాటల పోటీల్లో ఎన్నో బహుమతులు గెలుచుకుంది. ‘గోల్డెన్ వాయిస్’ అని శృతిని పిలిచేవారు. గానంలోనే కాదు పాటల కంపోజింగ్‌లో కూడా మంచి పేరు తెచ్చుకుంది శృతి.'
తన డైనమిక్ స్టేజీ పెర్‌ఫామెన్స్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది. తన అభిమాన మ్యూజిక్ కంపోజర్‌లు ప్రీతమ్, విశాల్–శేఖర్. ఎంత జటిలమైన పాటను అయినా అవలీలగా పాడే శృతి క్లాసిక్ సాంగ్స్ రీక్రియేటెడ్ వెర్షన్స్‌కు సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎందుకంటే ఏ చిన్న పొరపాటు జరిగినా విమర్శలు తప్పవు.
‘బాలీవుడ్ క్లాసిక్‌సాంగ్స్‌ను ఇష్టపడే లక్షలాది శ్రోతలలో నేను ఒకరిని. ఒక క్లాసిక్ సాంగ్‌కు సంబంధించి బ్యాడ్ వెర్షన్ విన్నప్పుడు ఎంత కోపం వస్తుందో నాకు తెలుసు. ఒరిజినల్ ఎసెన్స్ మిస్ కాకుండా పాడితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదృష్టవశాత్తు రీక్రియేట్ వెర్షన్‌కు సంబంధించి నాకు ప్రశంసలు తప్ప విమర్శలు ఎదురు కాలేదు’ అంటుంది శృతి రాణే.
Comments
Please login to add a commentAdd a comment