
సాక్షి, హైదరాబాద్ : కూకట్‌పల్లిలో ఓ ఇంటర్మీడియెట్ విద్యార్థి దారుణ హత్యకు గురైన సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. మూసాపేటకు చెందిన సుధీర్ సోమవారం ఉదయం ఇంటర్ పరీక్ష రాసేందుకు వెళుతుండగా.. దుండగులు నడిరోడ్డుపైనే వేటకొడవళ్లతో నరికి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కాగా స్నేహితులతో జరిగిన వివాదం కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. సుధీర్ స్నేహితులు నవీన్, కృష్ణ, మహీ, తేజ తదితరులు ఈ దారుణానికి పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment