Inter student murder
-
గొంతుకు చున్నీ బిగించి..
జహీరాబాద్: సంగారెడ్డి జిల్లాలో ఓ ఇంటర్ విద్యార్థిని హత్యకు గురైంది. జహీరాబాద్ మండలంలోని హుగ్గెల్లి గ్రామానికి దగ్గర్లో మామిడి తోటలో సోమవారం మధ్యాహ్నం ఓ బాలిక మృతదేహాన్ని చూసిన గ్రామస్తులు పోలీ సులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఈ హత్య విషయం వెలుగులోకి వచ్చింది. గొంతుకు చున్నీ బిగించి బాలికను హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. హుగ్గెల్లికి చెందిన బుజ్జమ్మ భర్త 15 ఏళ్ల కిందట చనిపోయాడు. దీంతో కూలీ పనులు చేస్తూ కొడుకు సురేశ్, కుమార్తె మౌనిక (16)ను పోషిస్తోంది. మౌనిక జహీరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీఈసీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో ఆదివారం తల్లి డ్వాక్రా గ్రూపు సమావేశానికి వెళ్లి రాత్రి 11.30 గంటలకు ఇంటికి చేరింది. కుమార్తె మరో గదిలో పడుకొని ఉంటుందని తల్లి భావించి నిద్రపోయింది. ఉదయం కుమార్తె కనిపించకపోవడంతో గ్రామంలో విచారించింది. మధ్యాహ్నం గ్రామ శివారులో మృతదేహం ఉందని తెలుసుకొని అక్కడికి వెళ్లి చూసి అది మౌనిక మృతదేహమేనని బోరున విలపించింది. సర్పంచ్ రాజు ఫిర్యాదు మేరకు డీఎస్పీ శంకర్రాజు, సీఐ రాజశేఖర్ సంఘటన స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జహీరాబాద్ ప్రభుత్వా స్పత్రికి తరలించారు. తల్లి ఫిర్యాదు మేరకు గ్రామానికి చెందిన ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు సమాచారం. -
కన్నతండ్రే 'కర్కోటకుడు'
కరీంనగర్ క్రైం: కన్నతండ్రే కర్కోటకుడిగా మారి కూతురును హత్య చేశాడు. కరీంనగర్‌కు చెందిన ఇంటర్ విద్యార్థిని ముత్త రాధికను గొంతు కోసి చంపింది ఆమె తండ్రి కొమురయ్యేనని పోలీసులు నిర్ధారించి, అరెస్టు చేశారు. పోలీస్ కమిషనర్ వీబీ కమలాసన్ రెడ్డి సోమవారం కేసు వివరాలను వెల్లడించారు. కమిషనర్ ఏం చెప్పారంటే.. కొమురయ్య హమాలీ. ఆయన కూతురు రాధిక చిన్ననాటి నుంచి పోలియోతో బాధపడేది. ఆమె వైద్యానికి తండ్రి రూ.6 లక్షలు ఖర్చు చేశాడు. ఇటీవల రాధికకు మళ్లీ ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి. దీంతో భవిష్యత్‌లో ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయని భావించిన కొమురయ్య.. రాధిక ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి చంపాడు. బయటి వ్యక్తులపై అనుమానం వచ్చేలా గొంతు కోశాడు. తండ్రి బనియన్, చెప్పులపై రక్తపు మరకలు.. అదే రోజు కొమురయ్య ఇంట్లో 99 వేల నగదు, 3 తులాల బంగారం పోయిందని ఫిర్యాదు చేసి కేసును పక్కదారి పట్టించాడు. పోలీసులు హత్య, దొంగతనం కేసుగా నమోదు చేశారు. కేసు దర్యాప్తునకు 8 బృందాలు ఏర్పాటు చేసి 75 మంది పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ సిటీ పోలీసు విభాగం క్లూస్ టీం వచ్చింది. జర్మన్ టెక్నాలజీ వాడి.. రాధిక తండ్రి బనియన్, చెప్పుల మీద ఆమె రక్తపు మరకలున్నట్లు గుర్తించింది. సంబంధిత నివేదిక వచ్చిన తర్వాత పోలీసుల అనుమానం నిజమైంది. 21 రోజుల విచారణ అనంతరం కొమురయ్యను తమదైన శైలిలో విచారించగా.. రాధికను తానే హతమార్చినట్లు అంగీకరించాడు. -
స్మార్ట్‌ఫోన్ కోసం ఇంటర్ విద్యార్థి దారుణహత్య
-
స్మార్ట్‌ఫోన్ కోసం అంత దారుణమా..
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని ఉప్పల్‌లో విషాదం చోటుచేసుకుంది. కిడ్నాప్‌నకు గురైన ఇంటర్ విద్యార్థి దారుణహత్యకు గురయ్యాడు. మూర్ఖపు కోరికతో స్నేహితుడే ఈ ఘాతుకానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపుతోంది. పోలీసుల కథనం ప్రకారం.. ఉప్పల్‌కు చెందిన ప్రేమ్, సాగర్ స్నేహితులు. వీరిద్దరూ ఇంటర్మీడియట్ చదువుతున్నారు. అయితే ప్రేమ్‌తో ఓ స్మార్ట్‌ఫోన్ ఉంది. ఆ ఫోన్‌పై ఆశపడ్డ సాగర్.. తనకు ఆ స్మార్ట్‌ఫోన్ ఇవ్వాలని కోరగా అందుకు ప్రేమ్ నిరాకరించాడు. ఈ నేపథ్యంలో సాగర్ పథకం ప్రకారం ఈ నెల 13న లాంగ్‌డ్రైవ్ పేరుతో బైకుపై ఆదిభట్ల వైపు తీసుకెళ్లాడని సమాచారం. అయితే సాగర్ తిరిగి రాగా, ప్రేమ్ మాత్రం ఇంటికి రాలేదు. దీంతో తమ కుమారుడు కనిపించడం లేదని ప్రేమ్ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీలు పరిశీలించి సాగర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా షాకింగ్ విషయాలు వెల్లడించాడు. ప్రేమ్‌ను అడిగితే స్మార్ట్‌ఫోన్ ఇవ్వలేదని.. దీంతో లాంగ్‌డ్రైవ్ పేరుతో బైకు మీద ఆదిభట్లకు తీసుకెళ్లి అక్కడే స్నేహితుడిని కిడ్నాప్ చేసి హత్య చేశానని చెప్పాడు సాగర్. ఆపై ప్రేమ్‌తో ఉన్న స్మార్ట్‌ఫోన్ తీసుకుని.. అతడి మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగులబెట్టినట్లు అంగీకరించాడు. దాదాపు మూడ్రోజుల తర్వాత కిడ్నాప్, హత్య కేసును పోలీసులు ఛేదించారు. అయితే స్మార్ట్‌ఫోన్ కోసం స్నేహితుడిని మరో విద్యార్థి హత్య చేయడంపై ఉప్పల్ వాసులు ఆందోళనకు గురవుతున్నారు. -
కూకట్ పల్లిలో ఇంటర్ విద్యార్థి హత్య
సాక్షి, హైదరాబాద్ : కూకట్‌పల్లిలో ఓ ఇంటర్మీడియెట్ విద్యార్థి దారుణ హత్యకు గురైన సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. మూసాపేటకు చెందిన సుధీర్ సోమవారం ఉదయం ఇంటర్ పరీక్ష రాసేందుకు వెళుతుండగా.. దుండగులు నడిరోడ్డుపైనే వేటకొడవళ్లతో నరికి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కాగా స్నేహితులతో జరిగిన వివాదం కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. సుధీర్ స్నేహితులు నవీన్, కృష్ణ, మహీ, తేజ తదితరులు ఈ దారుణానికి పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
సిద్దిపేట జిల్లాలో ఇంటర్ విద్యార్థిని హత్య
-
ఇంటర్ విద్యార్థిని దారుణ హత్య
సాక్షి, సిద్ధిపేట : పరీక్ష రాసేందుకు ఇంటి నుంచి బయటికి వెళ్లిన ఓ విద్యార్థిని అనూహ్యంగా జొన్న చేనులో శవమై కనిపించింది. సిద్ధిపేట జిల్లా, దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండలం రుద్రారంలో శనివారం ఉదయం వెలుగుచూసిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. రుద్రారం గ్రామానికి చెందిన 18 ఏళ్ల యువతి.. ఇంటర్ పరీక్షలు రాస్తున్నది. శుక్రవారం ఇంటి నుంచి పరీక్షకు బయలుదేరిన ఆమె సాయంత్రమైనా తిరిగిరాకపోవడంతో కుటుంబీకులు ఆందోళన చెందారు. శనివారం ఉదయానికి.. గ్రామానికి సమీపంలోగల జొన్న చేనులో యువతి మృతదేహాన్ని గుర్తించారు. గుర్తుతెలియని దుండగులు ఆమెను హత్యచేసి, దేహాన్నికాల్చేశారు. ఆమెపై అత్యాచారం కూడా జరిగి ఉంటుందని, ఆ విషయం బయటపడుతుందనే భయంతోనే దుండగులు యువతిని చంపేసి ఉంటారని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే మిరుదొడ్డి పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ద్యాప్తు ప్రారంభించారు. ఈ వార్తకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సిఉంది. -
దారుణం..!
♦ పరిచయస్తుని గదిలో ఇంటర్ విద్యార్థిని మృతదేహం ♦ గుండెలవిసేలా రోదిస్తున్న తల్లిదండ్రులు ♦ రూమ్‌కు తీసుకువచ్చి హత్య చేశారని ఆరోపణ ♦ పోలీసుల అదుపులో నిందితుడు ? ‘ కాలేజీకి వెళ్లి వస్తానమ్మా’ అంటూ వెళ్లిన కుమార్తె విగతజీవిలా పడిఉండడాన్ని చూసిన ఆమె తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. కన్నబిడ్డ కళ్ల ఎదుటే మృతదేహంలా పడివుండటాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారు. ఇంటిలో భోజనం చేసి వెళ్లిన కుమార్తె తేజశ్విని పరిచయస్తుని గదిలో నిర్జీవంగా పడిఉండడాన్ని అనుమానిస్తున్నారు. తన బిడ్డకు మాయమాటలు చెప్పి గదికి తీసుకువచ్చి హత్య చేశారని ఆరోపిస్తున్నారు. ఇంటర్మీడియెట్ విద్యార్థిని హత్యోదంతం రేపల్లె పట్టణంలో శుక్రవారం సంచలనం సృష్టించింది. రేపల్లెటౌన్ : పట్టణంలోని 14వ వార్డుకు చెందిన బొమ్మిడి సాంబశివవరప్రసాద్, రాజేశ్వరి దంపతులకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. స్థానికంగా వెల్డింగ్ పనులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. కుమార్తె తేజశ్వినిని నాలుగు రోజుల క్రితం ఇంటర్మీడియెట్‌లో చేర్పించారు. కుమారులు జ్యోతిప్రకాష్, దినేష్‌లు 9, 6వ తరగతి చదువుతున్నారు. 12వ వార్డులో అద్దెకు ఉంటున్న నిజాంపట్నం మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన చిప్పల నాగరాజు స్థానికంగా రొయ్యల కంపెనీలో పనిచేస్తున్నాడు. కొద్ది రోజుల కిందట నాగరాజు, తేజశ్విని మధ్య పరిచయం ఏర్పడింది. ఇదిలా ఉండగా తేజశ్విని గురువారం ఉదయం కాలేజీకి వెళ్లి భోజనానికి మధ్యాహ్నం ఇంటికి వచ్చింది. భోజనం చేసి కాలేజీకి వెళ్లివస్తానమ్మా అంటూ తల్లి రాజేశ్వరికి చెప్పి వెళ్లింది. సాయంత్రం దాటినా తేజశ్విని ఇంటికి రాకపోయేసరికి తల్లిదండ్రులు కాలేజీకి వెళ్లి వాకబు చేశారు. మధ్యాహ్నం నుంచి కాలేజీకి రాలేదని అక్కడ చెప్పటంతో ఆందోళనకు గురయ్యారు. కొత్తపాలెంలోని అమ్మమ్మ, నిజాంపట్నంలో పెద్దమ్మ ఇళ్లతో పాటు బంధువులకు ఫోన్లు చేసినా ఫలితం కనిపించలేదు. చివరకు ఇంటిలో ఉన్న సెల్‌ఫోన్‌కు నాలుగు సార్లు కాల్ వచ్చిన నంబర్‌ను వాకబు చేసి, అది రొయ్యల కంపెనీలో పనిచేసే చిప్పల నాగరాజుదిగా గుర్తించారు. దీంతో నాగరాజు సోదరి ఇంటికి వెళ్లగా, ఆమె బెదిరింపు ధోరిణితో మాట్లాడటంతో నాగరాజుపై అనుమానం వచ్చి బంధువులతో కలసి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో నాగరాజు రూమ్ యజమాని అడుసుమల్లి శాంతకుమారి ఓ బాలిక మృతదేహం నాగరాజుకు అద్దెకు ఇచ్చిన గదిలో పడివున్నట్టు పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. దీంతో అనుమానం వచ్చి సీఐ మల్లిఖార్జునరావు తో పాటు వెళ్లి చూడగా, తేజశ్వినిగా గుర్తించి బోరున విలపించారు. నా బిడ్డను హత్య చేశారు.. తేజశ్వినికి మాయమాటలు చెప్పి గదికి తీసుకువెళ్లి హత్య చేశారని మృతురాలి తల్లిదండ్రులు రాజేశ్వరి, సాంబశివవరప్రసాద్, బంధులు ఆరోపిస్తున్నారు. దీంట్లో నాగరాజుతో పాటు కొంత మంది ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మృతదేహం మెడపై రక్తం మరకలు, నోటిపై నురగ ఉన్నాయి. గదిలో డ్రింక్ బాటిల్స్, వాటర్ బాటిల్స్ పడివుండి ఉన్నాయి. తేజశ్విని తానే స్వయంగా ఈ గదికి వచ్చిందా లేక ఎవరైనా ఎత్తుకొచ్చారా, హత్యకు ఎలా గురైంది అనే అంశాలు మిస్టరీగానే ఉన్నాయి .ఇదిలా ఉండగా నాగరాజును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. హత్య కేసుగా నమోదు.. శవపంచనామా అనంతరం పోస్టుమార్టం నిమిత్తం విద్యార్థిని మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్యకేసుగా నమోదు చేసినట్టు సీఐ మల్లిఖార్జునరావు చెప్పారు. నిందితులను కఠినంగా శిక్షించాలి... విద్యార్థిని హత్య వార్త క్షణాల్లో పట్టణంలో వ్యాపించటంతో అధిక సంఖ్యలో జనం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తేజశ్విని మృతికి కారణమైన చిప్పల నాగరాజును కఠినంగా శిక్షించాలని ప్రజలు, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. అదే విధంగా నాగరాజుతో పాటు ఆ గదికి వెళ్లింది ఎవరు అనే అంశంపై, ఆ లోపల ఏం జరిగిందనే విషయంపై క్షుణ్ణంగా దర్యాప్తు నిర్వహించి నిజాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. -
విద్యార్ధిని హత్య చేసిన స్నేహితులు