ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, సిద్ధిపేట : పరీక్ష రాసేందుకు ఇంటి నుంచి బయటికి వెళ్లిన ఓ విద్యార్థిని అనూహ్యంగా జొన్న చేనులో శవమై కనిపించింది. సిద్ధిపేట జిల్లా, దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండలం రుద్రారంలో శనివారం ఉదయం వెలుగుచూసిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
రుద్రారం గ్రామానికి చెందిన 18 ఏళ్ల యువతి.. ఇంటర్ పరీక్షలు రాస్తున్నది. శుక్రవారం ఇంటి నుంచి పరీక్షకు బయలుదేరిన ఆమె సాయంత్రమైనా తిరిగిరాకపోవడంతో కుటుంబీకులు ఆందోళన చెందారు. శనివారం ఉదయానికి.. గ్రామానికి సమీపంలోగల జొన్న చేనులో యువతి మృతదేహాన్ని గుర్తించారు. గుర్తుతెలియని దుండగులు ఆమెను హత్యచేసి, దేహాన్నికాల్చేశారు. ఆమెపై అత్యాచారం కూడా జరిగి ఉంటుందని, ఆ విషయం బయటపడుతుందనే భయంతోనే దుండగులు యువతిని చంపేసి ఉంటారని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే మిరుదొడ్డి పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ద్యాప్తు ప్రారంభించారు. ఈ వార్తకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సిఉంది.
Comments
Please login to add a commentAdd a comment