మహిళా సర్పంచ్‌ కుల బహిష్కరణ | Woman Sarpanch Of Mirdoddi Expelled From Caste | Sakshi
Sakshi News home page

మహిళా సర్పంచ్‌ కుల బహిష్కరణ

Published Fri, Dec 6 2019 9:24 AM | Last Updated on Fri, Dec 6 2019 9:24 AM

Woman Sarpanch Of Mirdoddi Expelled From Caste - Sakshi

తీర్మానం కాపీ

సాక్షి, మిరుదొడ్డి: ఎన్నికలకు ముందు తమ కులానికి ఇస్తానన్న డబ్బులు ఏడాది దాటినా ఇవ్వకపోవడంతో అదే వర్గానికి చెందిన కులస్తులంతా కలసి మహిళా సర్పంచ్‌ కుటుంబాన్ని కులం నుంచి బహిష్కరిస్తూ తీర్మానించారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలోని బేగంపేటలో గురువారం చోటుచేసుకుంది. అనసూయ.. తనను సర్పంచ్‌గా ఏకగ్రీవం గా ఎన్నుకుంటే మహంకాళమ్మ గుడి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తానని చెప్పింది. గెలిచాక ఆ సొమ్ము ఇవ్వకపోవడంతో అనసూయ కుటుంబాన్ని బహిష్కరించారు. దీనిపై అనసూయ స్పందిస్తూ.. తనపై కొందరు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement