Caste expulsion
-
మహిళా సర్పంచ్ కుల బహిష్కరణ
సాక్షి, మిరుదొడ్డి: ఎన్నికలకు ముందు తమ కులానికి ఇస్తానన్న డబ్బులు ఏడాది దాటినా ఇవ్వకపోవడంతో అదే వర్గానికి చెందిన కులస్తులంతా కలసి మహిళా సర్పంచ్ కుటుంబాన్ని కులం నుంచి బహిష్కరిస్తూ తీర్మానించారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలోని బేగంపేటలో గురువారం చోటుచేసుకుంది. అనసూయ.. తనను సర్పంచ్‌గా ఏకగ్రీవం గా ఎన్నుకుంటే మహంకాళమ్మ గుడి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తానని చెప్పింది. గెలిచాక ఆ సొమ్ము ఇవ్వకపోవడంతో అనసూయ కుటుంబాన్ని బహిష్కరించారు. దీనిపై అనసూయ స్పందిస్తూ.. తనపై కొందరు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించింది. -
మనుగొండలో కుల బహిష్కరణ
ఆత్మకూరు(పరకాల): వీఆర్ఏ కొలువు విషయంలో నెలకొన్న వివాదం ఓ దళిత కుటుంబం కుల బహిష్కరణకు దారితీసింది. వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం మనుగొండ గ్రామానికి చెందిన తుప్పరి సమ్మయ్య కొంత కాలంగా కుల పరంగా వీఆర్ఏగా విధులు నిర్వర్తి స్తున్నాడు. గతంలో ఏటా అదే కులంలోని ఒకరు ఈ విధులు నిర్వర్తించేవారు. ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఎవరు ఆ విధుల్లో ఉంటే వారికే ఆ ఉద్యోగం వచ్చింది. దీంతో వీఆర్ఏ ఉద్యోగం విషయమై గొడవలు మొదలయ్యాయి. సమ్మయ్యతోపాటు అతడి భార్య యశోద, కూతురు పవిత్ర, కుమారుడు ఉదయ్‌శంకర్‌ను సదరు కులం పెద్దలు శనివారం బహిష్కరించారు. వారితో ఎవరైనా మాట్లాడితే రూ.500 జరిమానా విధిస్తామని తీర్మానించారు. ‘తమను హోటళ్లకు కూడా వెళ్లనీయడం లేదు.. కుల పెద్దలు తమను గతం నుంచి ఇబ్బందులకు గురి చేస్తున్నారు.. గతంలో తమ చేలను ధ్వంసం చేశారు.. పెళ్లిళ్లు.. చావులకు రానీయడం లేదు.. పొదుపు సంఘం నుంచి తొలగించారు..’అంటూ బాధిత కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. -
పది కుటుంబాల వెలి
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘటన సాక్షి, సిరిసిల్ల/ఎల్లారెడ్డిపేట: పంచాయితీలో తమ మాట వినకుండా కోర్టుకు వెళ్లారనే అక్కసుతో పదికుటుంబాలను కులం నుంచి బహిష్కరిస్తూ ‘పెద్దలు’తీర్పు చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో ఈ ఘటన వెలుగు చూసింది. వెంకటాపూర్‌కి చెందిన చీకోటి లింగయ్య, చీకోటి పర్శయ్య, చీకోటి మల్లయ్య తమ భూములను అదే గ్రామానికి చెందిన మారుపాక రాజు, మారుపాక బాలయ్య, ఆశయ్య, చిన్న ఆశయ్య, పర్శయ్య, చంద్రయ్య, ఎల్లయ్య, రాజు, పరశు రాములు, వెంకటయ్య, రాములు సాగు చేసుకుంటున్నారని రెండు నెలల క్రితం పంచాయితీ పెట్టారు. తమ తాతలకాలం నుంచి 4.05 ఎకరాలు తమ ఆధీనంలోనే ఉందని బాధితులు చెప్పారు. ఈ క్రమంలో కుల పెద్దలు 4.05 ఎకరాల నుంచి 1.15 ఎకరాలను చీకోటి లింగయ్య, పర్శయ్య, మల్లయ్యకు చెందుతుందని తీర్పు చెప్పారు. వారి తీర్పు నచ్చని మారుపాక కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించారు. దీంతో పది కుటుంబాలను కుల బహిష్కరణ చేశా రు. బహిష్కరణకు గురైన వారితో ఎవరైనా మాట్లాడితే రూ. 500 జరిమానా నిబంధన విధించారు. చీకోటి కుటుంబం బావి నుం చి మారుపాక ఆశయ్య పొలానికి సాగునీరు బంద్ చేయడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించాయి. క్రమంలోనే గత శనివారం కోర్టు నుంచి ఈ భూమి మారుపాక కుటుం బ సభ్యులకే చెందుతుందని తీర్పు కూడా వచ్చింది. అయినా బహిష్కరణ కొనసాగు తోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. ‘పెద్దల’తోపాటు అందుకు కారణ మైన వారిపై సోమ వారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉపేందర్ తెలిపారు.