పది కుటుంబాల వెలి
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘటన
సాక్షి, సిరిసిల్ల/ఎల్లారెడ్డిపేట: పంచాయితీలో తమ మాట వినకుండా కోర్టుకు వెళ్లారనే అక్కసుతో పదికుటుంబాలను కులం నుంచి బహిష్కరిస్తూ ‘పెద్దలు’తీర్పు చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో ఈ ఘటన వెలుగు చూసింది. వెంకటాపూర్‌కి చెందిన చీకోటి లింగయ్య, చీకోటి పర్శయ్య, చీకోటి మల్లయ్య తమ భూములను అదే గ్రామానికి చెందిన మారుపాక రాజు, మారుపాక బాలయ్య, ఆశయ్య, చిన్న ఆశయ్య, పర్శయ్య, చంద్రయ్య, ఎల్లయ్య, రాజు, పరశు రాములు, వెంకటయ్య, రాములు సాగు చేసుకుంటున్నారని రెండు నెలల క్రితం పంచాయితీ పెట్టారు. తమ తాతలకాలం నుంచి 4.05 ఎకరాలు తమ ఆధీనంలోనే ఉందని బాధితులు చెప్పారు.
ఈ క్రమంలో కుల పెద్దలు 4.05 ఎకరాల నుంచి 1.15 ఎకరాలను చీకోటి లింగయ్య, పర్శయ్య, మల్లయ్యకు చెందుతుందని తీర్పు చెప్పారు. వారి తీర్పు నచ్చని మారుపాక కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించారు. దీంతో పది కుటుంబాలను కుల బహిష్కరణ చేశా రు. బహిష్కరణకు గురైన వారితో ఎవరైనా మాట్లాడితే రూ. 500 జరిమానా నిబంధన విధించారు. చీకోటి కుటుంబం బావి నుం చి మారుపాక ఆశయ్య పొలానికి సాగునీరు బంద్ చేయడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించాయి. క్రమంలోనే గత శనివారం కోర్టు నుంచి ఈ భూమి మారుపాక కుటుం బ సభ్యులకే చెందుతుందని తీర్పు కూడా వచ్చింది. అయినా బహిష్కరణ కొనసాగు తోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. ‘పెద్దల’తోపాటు అందుకు కారణ మైన వారిపై సోమ వారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉపేందర్ తెలిపారు.