హైదరాబాద్ : సెలబ్రిటీల జీవితాల్లోకి తొంగి చూడాలని కొందరు అత్యుత్సాహం చూపిస్తారు. ఈ క్రమంలో సెలబ్రిటీలు వాళ్లకు ఘాటుగా బదులివ్వడం తరచుగా చూస్తుంటాం. సరిగా ‘జబర్దస్త్’ యాంకర్, నటి రష్మీ గౌతం విషయంలో ఇలానే జరిగింది. ‘‘జబర్దస్త్’ కమెడియన్ సుడిగాలి సుధీర్, మీరు (రష్మీ) మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లా ఉంటారు. మీ కెరీర్‌లో ఎంతో శ్రమిస్తున్నారు. మీ ఇద్దరు పెళ్లి చేసుకోండంటూ’ ప్రసన్న కుమార్ అనే నెటిజన్ రష్మీకి సలహా ఇస్తూ ట్వీట్ చేశాడు.
ఈ విషయంపై యాంకర్ రష్మీ ఎంతో హుందాగా, ఘాటుగానూ సమాధానమివ్వడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ‘మేమిద్దరం (సుధీర్, నేను) మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని నీకెలా తెలుసు. స్క్రీన్ మీద చూసి నువ్వు అలా భావించి ఉంటావు. రీల్ లైఫ్.. రియల్ కాదని తెలుసుకో. వీక్షకులకు వినోదాన్ని పంచేందుకు ప్రోగ్రామ్స్‌లో సరదాగా ఉంటాం. అంతేకానీ ఎవరిని పెళ్లి చేసుకోవాలన్నది మాకు తెలుసు. మా ఇష్టం. మీ సలహాలు అక్కర్లేద’ని రష్మీ బదులిచ్చారు. ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
ఇలాంటి సలహాలు ఇవ్వడం సరైంది కాదని, వారి వ్యక్తిగత జీవితాన్ని వారికి వదిలేయాలని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. అది కేవలం తన అభిప్రాయమేనని.. వాక్ స్వాతంత్ర్యపు హక్కును మాత్రమే వాడుకున్నట్లు ప్రసన్న కుమార్ మళ్లీ ట్వీట్ చేశాడు. అభ్యంతరకర విషయాలు మాట్లాడనంత వరకు ఎలాంటి సమస్య ఉండదన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment