
జబర్దస్త్‌గా జీవించండి
బుల్లితెర హాస్యనటుడు గెటప్ శ్రీను
ఆకివీడు : జీవితాన్ని జబర్దస్త్‌గా మలుచుకోవడం కూడా కళేనని బుల్లితెర హాస్యనటుడు గెటప్ శ్రీను అన్నారు. ఆకివీడులో జరుగుతున్న డీవైఎఫ్‌ఐ రాష్ట్రస్థాయి చెడుగుడు పోటీలను ఆదివారం ఆయన తిలకించారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని అనంతరం మాట్లాడారు. కొల్లేరు తీరంలో చిన్న గ్రామంలో తాను జన్మించానని, పండగ రోజుల్లో ఇక్కడికి వచ్చి ఆనందంతో తిరిగి వెళుతుంటానన్నారు.
ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడుగా పనిచేశానని చెప్పారు. మండలంలోని కాళింగపేటలో శనివారం రాత్రి గ్రామీణ క్రీడల ముగింపు సభలో మాట్లాడారు. యువత చెడు వ్యసనాల వైపు మరల కుండా గ్రామీణ క్రీడలు దోహదపడతాయన్నారు. క్రీడల వల్ల అందరితో కలిసి మెలిసి జీవించే అవకాశం లభిస్తుందని చెప్పారు. గ్రామీణ క్రీడలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని కోరారు. విజేతలకు బహుమతులు అందించారు.