
అనసూయ భరద్వాజ్.. బుల్లితెర ప్రేక్షకులకు బాగా తెలిసిన పేరు ఇది. టీవీల్లో పలు షోలు చేసూకుంటూ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన అందాల యాంకరమ్మ అనసూయ. బుల్లి తెరపై అందాలు ఆరబోస్తూ, అద్భుతమైన వ్యాఖ్యానంతో అలరిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును, అభిమానులను సంపాదించుకుంది.
కామెడీ షో జబర్దస్ అనసూయకి యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. తాజాగా ఈ షో నుంచి అనసూయ తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అనసూయ పరోక్షంగా కామెంట్స్ చేస్తూ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.
‘నా కెరీర్‌లో నేను చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నాను. నాతో పాటు చాలా మొమోరీస్‌ని తీసుకెళ్తున్నాను. అందులో ఎన్నో మధురక్షణాలతో పాటు.. కొన్ని చేదు క్షణాలు.. కూడా ఉన్నాయి. మున్ముందు కూడా ఎప్పటిలాగే మీ ఆదరణ నాకు ఉంటుందని భావిస్తున్నాను’అని అనసూయ రాసుకొచ్చింది.
జబర్దస్త్ నుంచి విడిచి వెళ్ళుతుండడంతో అనసూయ ఈ కామెంట్స్ పోస్ట్ చేసిందని అంటున్నారు. ఇక అనసూయ సినిమాల విషయానికొస్తే..ఇటీవలే పుష్ప సినిమాలో దాక్షాయణిగా మెప్పించింది. ప్రస్తుతం ఆమె నటించిన అరి, రంగమార్తండ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment