
మాట్లాడుతున్న టీజేఏఏ రాష్ట్ర అధ్యక్షుడు వంశీకృష్ణ
హైదరాబాద్ : న్యాయవ్యవస్థను కించపరిచే విధంగా జబర్దస్త్‌లో ఉన్న సన్నివేశాలను తొలగించాలని తెలంగాణ జూనియర్ అడ్వకేట్ అసోసియేషన్ (టీజేఏఏ) రాష్ట్ర అధ్యక్షుడు జె.వంశీకృష్ణ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఆదివారం హైదర్‌గూడలోని ఎన్‌ఎస్‌ఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... జబర్దస్త్‌లో నటించిన సన్నివేశాలు న్యాయమూర్తి, న్యాయవాదులు, కోర్టులను అవహేళన చేసే విధంగా ఉండటంతో ప్రజల్లో న్యాయవ్యవస్థపై నమ్మకం పోయే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే అటువంటి సన్నివేశాలను తొలగించాలని లేని పక్షంలో ఆందోళనలు చేస్తామన్నారు. ఈ సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేష్, నాయకుడు జె.తులసిరామ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment