ఆస్పత్రిలో చేరిన 'జబర్దస్త్' ఫైమా.. అసలు ఏమైందంటే? | Jabardasth Faima In Hospital Video Viral | Sakshi

Jabardasth Faima: చేతికి సెలైన్‌తో షాకిచ్చిన ఫైమా.. సమస్య అదేనా?

Nov 25 2023 5:43 PM | Updated on Nov 25 2023 5:53 PM

 Jabardasth Faima In Hospital Video Viral - Sakshi

'జబర్దస్త్' షోతో చాలామంది పాపులర్ అయ్యారు. మిగతా వాళ్ల సంగతేమో గానీ ఫైమా మాత్రం చాలా స్పెషల్. ఓ స్టాండప్ కామెడీ షోలో తన ప్రతిభని నిరూపించుకుని, ఆ తర్వాత తన కోసమే స్కిట్స్ చూసే రేంజుకి వెళ్లిపోయింది. బిగ్‌బాస్ గత సీజన్‌లో ఆడే అవకాశం దక్కించుకుని మంచిగా సెటిలైపోయింది. అలాంటి ఫైమా.. ఇప్పుడు సడన్‌గా ఆస్పత్రి బెడ్‌పై కనిపించి షాకిచ్చింది. ఇంతకీ ఏమైంది?

(ఇదీ చదవండి: భర్తని పరిచయం చేసిన హీరోయిన్ ఇలియానా.. ఇతడెవరో తెలుసా?)

పేద కుటుంబానికి చెందిన ఫైమా.. తొలుత స్టాండప్ కమెడియన్‌గా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత 'జబర్దస్త్'లో అవకాశం దక్కించుకుంది. తనదైన మేనరిజమ్, టైమింగ్ ఈమెకు చాలా ప్లస్ అయ్యాయి. అలా బిగ్‌బాస్, డ్యాన్స్ షోలో పాల్గొని తనలోని మరిన్ని టాలెంట్స్ ఉన్నాయని బయటపెట్టింది. ప్రస్తుతం మళ్లీ 'జబర్దస్త్'లో భాస్కర్ టీమ్‌లో చేస్తోంది.

సరే ఇదంతా పక్కనబెడితే తాజాగా ఫైమా ఆస్పత్రిలో చేతికి సెలైన్‌తో కనిపించింది. స్వయంగా ఈ వీడియోని తనే ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. అయితే ఏమైంది? అసలెందుకు ఆస్పత్రిలో ఉందనే కారణం మాత్రం చెప్పలేదు. బహుశా వాతవరణం మార్పు వల్ల జ్వరం ఏమైనా వచ్చిందా? అనే సందేహం వస్తోంది. అలానే అభిమానులు మాత్రం.. ఫైమా త్వరగా కోలుకోవాలని వీడియో దిగువన కామెంట్స్ పెడుతున్నారు.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌ హౌస్‌లో కంటెస్టెంట్‌కు ప్రెగ్నెన్సీ టెస్ట్‌.. రిజల్టిదే!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement