చలాకి చంటి కారుకు ప్రమాదం | Chalaki Chanti Injured In Road Accident | Sakshi
Sakshi News home page

చలాకి చంటి కారుకు ప్రమాదం

Jun 18 2019 9:12 AM | Updated on Mar 22 2024 10:40 AM

సినిమా వాళ్లనే కాదు టీవీ నటులను కూడా ప్రమాదాలు వెంటాడుతున్నాయి. రోడ్డు ప్రమాదాలు, షూటింగ్‌లో అపశ్రుతుల కారణంగా పలువురు యువ హీరోలు గాయపడిన సంగతి తెలిసిందే. తాజాగా ‘జబర్దస్త్’ ఫేం చలాకి చంటి పెద్ద ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న చలాకి చంటి కారు లారీని వెనక నుంచి ఢీకొంది. మంగళవారం ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో సూర్యాపేట జిల్లా కోదాడ కొమరబండ వద్ద 65 నంబరు జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.
 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement