
రచ్చరవి
పాపన్నపేట(మెదక్): మన రాష్ట్ర వృక్షమైన జమ్మిచెట్టును ఊరురా పెంచాలని జబర్దస్త్ హస్యనటుడు రచ్చరవి కోరాడు. మండలంలోని ఎడుపాయాల నవ దుర్గామాతను మంగళవారం ఆయన దర్శించుకున్నాడు. త్రిదండి చినజీయర్ స్వామి మంగళ శాసనాలతో త్రిదండి అహోబిల రామానుజ జీయర్ స్వామి ఆశీస్సులతో ‘మన జమ్మిచెట్టు’ కార్యక్రమంలో భాగంగా ప్రారంభించినట్లు తెలిపారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మణ్ విష్ణువర్దన్‌రెడ్డికి జమ్మిచెట్టును అందించారు.