రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ ఆర్టిస్ట్ రచ్చరవికి గాయాలయ్యాయని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. సూర్యాపేట - మునగాల వద్ద అదుపుతప్పిన కారు డివైడర్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు కథనాలొచ్చాయి. అయితే ఈ ప్రమాదం వార్తలపై జబర్దస్త్ కమెడియన్ రచ్చ రవి క్లారిటీ ఇచ్చారు. అలాంటిదేం జరగలేదని వాటిని కొట్టిపారేశారు.
తనకు ఏమీ కాలేదని రచ్చ రవి అభిమానులకు ఫోన్ చేసి చెప్పారు. పుణెలో షూటింగ్ జరుపుకుని క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చినట్లు వివరించారు. తాను ఫ్లైట్‌లోనే హైదరాబాద్‌కు వచ్చినట్లు చెప్పారు. శనివారం జరగనున్న వాల్తేరు వీరయ్య మూవీ సక్సెస్ మీట్‌కు కూడా వెళ్తున్నానని రచ్చరవి క్లారిటీ ఇచ్చారు. అభిమానుల ఆశీస్సులు తనకెప్పుడూ ఉంటాయని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment