నటుడు, కమెడియన్ జోష్ రవి సినీ ఇండస్ట్రీకి వచ్చి 14 ఏళ్లవుతోంది. ఇప్పటివరకు వందకు పైగా సినిమాలు చేశాను, కానీ ఇందులో గుర్తుపెట్టుకునేవి 20-30 మాత్రమే ఉంటాయంటున్నాడు జోష్ రవి. తాజాగా ఆయన మాట్లాడుతూ.. 'గుండెజారి గల్లంతయ్యిందే సినిమాతో మంచి బ్రేక్ వచ్చింది. రవితేజ ఫోన్ చేసి మెచ్చుకుంటే కన్నీళ్లాగలేదు. కానీ తర్వాత అన్నీ గే క్యారెక్టర్స్ వచ్చాయి. అస్తమానం అవే చేస్తే బాగోదని వాటన్నింటినీ వదులుకున్నాను.
మొదట్లో చాలా కష్టాలు పడ్డాను. తిండీతిప్పలు మాని తిరిగాను. వచ్చిన అవకాశంతో నన్ను నేను నిరూపించుకున్నాను. జనాలు ఆదరించారు. నేను నటించిన మొదటి చిత్రం మగధీర. కానీ ఎక్కువ నిడివి పాత్ర జోష్‌లో ఉండటంతో జోష్ రవిగా నా పేరు స్థిరపడిపోయింది. నాన్నకు ప్రేమతో సినిమాలో జూ.ఎన్టీఆర్ ఫ్రెండ్‌గా నేను చేయాల్సింది. సుకుమార్‌గారికి ఫోటో కూడా పంపాను. కానీ ఎవరో ఎదగడం కోసం మధ్యలో ఉన్నవాళ్లు నా గురించి నెగెటివ్‌గా చెప్పి ఆ ఆఫర్ రాకుండా చేశారు. చాలా సంవత్సరాల తర్వాత ఈ విషయం నాకూ, సుకుమార్‌కు కూడా తెలిసింది.
జబర్దస్త్ షోపై నాకు గౌరవం ఉంది. కానీ రూ.2 లక్షలు ఇస్తానన్నా నేను వెళ్లను. ఎందుకంటే నేను కేవలం సినిమాలే చేస్తాను. జబర్దస్త్ నుంచి బయటకు వచ్చినప్పటికీ నాలుగు సార్లు షోకి గెస్ట్‌గా వెళ్లాను. ఇప్పటికీ గెస్ట్‌గా రమ్మంటే వెళ్తాను. కానీ అక్కడే ఉండి డబ్బు సంపాదించాలనేది లేదు. ఎందుకంటే నేను 20కు పైగా సినిమాలు చేశాక జబర్దస్త్‌కు వెళ్లాను. అప్పుడు నాకు రెండు, మూడు వేలు మాత్రమే ఇచ్చేవారు. నాకు సినిమా అనేది ప్రధానం. ఇక్కడ అవకాశాలు రాకపోయినా ఖాళీగా కూర్చుంటానే తప్ప జబర్దస్త్ చేయను' అని చెప్పుకొచ్చాడు.
చదవండి: విజయ్ దేవరకొండకు కాబోయే భార్యపై సామ్ కామెంట్స్ వైరల్
శుక్రవారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలివే
Comments
Please login to add a commentAdd a comment