Josh Ravi
-
రూ.2 లక్షలిస్తానన్నా జబర్దస్త్‌కు వెళ్లను: కమెడియన్
నటుడు, కమెడియన్ జోష్ రవి సినీ ఇండస్ట్రీకి వచ్చి 14 ఏళ్లవుతోంది. ఇప్పటివరకు వందకు పైగా సినిమాలు చేశాను, కానీ ఇందులో గుర్తుపెట్టుకునేవి 20-30 మాత్రమే ఉంటాయంటున్నాడు జోష్ రవి. తాజాగా ఆయన మాట్లాడుతూ.. 'గుండెజారి గల్లంతయ్యిందే సినిమాతో మంచి బ్రేక్ వచ్చింది. రవితేజ ఫోన్ చేసి మెచ్చుకుంటే కన్నీళ్లాగలేదు. కానీ తర్వాత అన్నీ గే క్యారెక్టర్స్ వచ్చాయి. అస్తమానం అవే చేస్తే బాగోదని వాటన్నింటినీ వదులుకున్నాను. మొదట్లో చాలా కష్టాలు పడ్డాను. తిండీతిప్పలు మాని తిరిగాను. వచ్చిన అవకాశంతో నన్ను నేను నిరూపించుకున్నాను. జనాలు ఆదరించారు. నేను నటించిన మొదటి చిత్రం మగధీర. కానీ ఎక్కువ నిడివి పాత్ర జోష్‌లో ఉండటంతో జోష్ రవిగా నా పేరు స్థిరపడిపోయింది. నాన్నకు ప్రేమతో సినిమాలో జూ.ఎన్టీఆర్ ఫ్రెండ్‌గా నేను చేయాల్సింది. సుకుమార్‌గారికి ఫోటో కూడా పంపాను. కానీ ఎవరో ఎదగడం కోసం మధ్యలో ఉన్నవాళ్లు నా గురించి నెగెటివ్‌గా చెప్పి ఆ ఆఫర్ రాకుండా చేశారు. చాలా సంవత్సరాల తర్వాత ఈ విషయం నాకూ, సుకుమార్‌కు కూడా తెలిసింది. జబర్దస్త్ షోపై నాకు గౌరవం ఉంది. కానీ రూ.2 లక్షలు ఇస్తానన్నా నేను వెళ్లను. ఎందుకంటే నేను కేవలం సినిమాలే చేస్తాను. జబర్దస్త్ నుంచి బయటకు వచ్చినప్పటికీ నాలుగు సార్లు షోకి గెస్ట్‌గా వెళ్లాను. ఇప్పటికీ గెస్ట్‌గా రమ్మంటే వెళ్తాను. కానీ అక్కడే ఉండి డబ్బు సంపాదించాలనేది లేదు. ఎందుకంటే నేను 20కు పైగా సినిమాలు చేశాక జబర్దస్త్‌కు వెళ్లాను. అప్పుడు నాకు రెండు, మూడు వేలు మాత్రమే ఇచ్చేవారు. నాకు సినిమా అనేది ప్రధానం. ఇక్కడ అవకాశాలు రాకపోయినా ఖాళీగా కూర్చుంటానే తప్ప జబర్దస్త్ చేయను' అని చెప్పుకొచ్చాడు. చదవండి: విజయ్ దేవరకొండకు కాబోయే భార్యపై సామ్ కామెంట్స్ వైరల్ శుక్రవారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలివే -
అరటి గెలలమ్మి సినిమా చూశాం
హైదరాబాద్: గుండెజారి గల్లంతయ్యిందే సినిమాతో అందరినీ కడుపుబ్బా నవ్వించిన జోష్ రవి తన చిన్నతనంలో వేసవి సెలవుల్లో చేసిన అల్లరి తలచుకుంటే నవ్వొస్తుందంటున్నాడు. ఆ రోజులను గుర్తు చేసుకుంటూ ఒక్కసారి గతంలోకి వెళ్లి వచ్చారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే... పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పక్కనే ఉన్న మార్టేరు మా సొంతూరు. వేసవి సెలవుల్లో హైస్కూల్ పక్కనే ఎస్ఆర్ఏ టాకీస్ ఉండేది. రోజులో మూడు ఆటలు చూసేవాళ్లం. ఐశ్వర్యారాయ్ ‘తాళ్’, చిరంజీవి, రజనీకాంత్ సినిమాలను పదుల సార్లు చూసేదాకా ప్రాణం నిలిచేది కాదు. ఊరు పక్కనే అరటి తోటలు ఉండేవి. ఎవరూ లేని సమయంలో అరటి గెలలు కోసి దూరంగా భూమిలో దాచి పెట్టే వాళ్లం. వారం, పది రోజుల తర్వాత అరటికాయలు పళ్లు అవ్వగానే అమ్మేసి వచ్చిన డబ్బుతో సినిమాలు చూసేవాళ్లం. అరటి తోటల యజమానులు మమ్మల్ని భయపెట్టడం, ఇంట్లో వాళ్లకి చెప్పడం చేసినా మళ్లీ మమూలే. వేసవి వచ్చిందంటే మా ప్రపంచమంతా సినిమాలే. డబ్బులు లేని సమయంలో క్రికెట్ ఆడటం, పందేలు పెట్టుకుని చెరువుల్లో ఈత కొట్టడమంటే మాకు సరదా. ఇప్పుడు సినిమాల్లో బిజీ అయ్యాక ఖాళీ దొరకడం లేదు. హైదరాబాద్‌లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరున్న బాస్కెట్‌బాల్ కోర్టుకి సరదాగా వెళుతుంటా. ఎప్పుడైనా ఖాళీ దొరికితే ఊరెళ్లి మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ అమ్మ చేసిన వంటకాలను లాగించేస్తుంటా. -
కన్నడంలో కేక పెట్టించిన తెలుగు కుర్రాడు
ఒక పరిశ్రమ నుంచి హిట్టైన సినిమాలు మరో పరిశ్రమకు వెళ్లటం సహజం. అయితే ఆర్టిస్టులు మాత్రం సాధారణంగా ఒక ప్రాంతానికే పరిమితమవుతూంటారు. హీరోలు అయినా రెండు,మూడు లాంగ్వైజ్ లలో ప్లాన్ చేసుకోవటమో లేక వేరే చోట అవకాసమొస్తే అక్కడకి వెళ్లి నటించటమో చేస్తూంటారు. క్యారెక్టర్ ఆర్టిస్టులకు మాత్రం అలాంటి ఆఫర్స్ అరుదుగా వస్తాయి. వచ్చినా ప్రూవ్ చేసుకునే వాళ్లు చాలా తక్కువ. తెలుగులో జోష్ రవిగా పేరు తెచ్చుకున్న యువ కమిడియన్ గా దూసుకు వెళ్తున్న రవికి అలాంటి అవకాసం వచ్చింది. తెలుగులో హిట్టైన గుండెజారి గల్లంతైంది చిత్రాన్ని ఖుషి ఖుషియాగి టైటిల్ తో కన్నడంలో రీమేక్ అయ్యింది. తెలుగు గే క్యారెక్టర్....చేసిన జోష్ రవికి ఇక్కడ మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో కన్నడ వెర్షన్ కు సైతం అతన్నే ఆ పాత్రకు తీసుకున్నారు. అక్కడ సైతం రవికి మంచి రెస్పాన్స్ వస్తోంది. తెలుగులో మెప్పించిన రవి, కన్నడంలోనూ అదే క్యారెక్టర్ చేసి కన్నడ ప్రేక్షకులను సైతం ఆకట్టుకున్నాడు. థియోటర్ లో రవి పాత్రకు మంచి రెస్పాన్స్ రావటంతో అక్కడ నుంచి ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. కన్నడంలో కేక పెట్టించిన మన కుర్రాడు జోషి రవి మాట్లాడుతూ.... గణేష్ లాంటి పెద్ద హీరోతో తొలి చిత్రం చేయటం తన అదృష్టమని చెప్పారు. అలాగే కన్నడ పరిశ్రమలో మంచి టెక్నీషియన్స్ ఉన్నారని, క్రమశిక్షణతో సాగే పరిశ్రమ అన్నారు. తన పాత్రను రిసీవ్ చేసుకుంటున్న కన్నడ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. -
కాయ్ రాజా కాయ్ మూవీ పోస్టర్స్
-
కాయ్ రాజా కాయ్ మూవీ స్టిల్స్
-
'కాయ్ రాజా కాయ్' వర్కింగ్ స్టిల్స్
-
'కాయ్ రాజా కాయ్' ఆడియో ఆవిష్కరణ