
పెళ్లి వేడుకలో హైపర్ ఆది తదితరులు
సాక్షి, కర్నూలు (కృష్ణగిరి): గుడెంపాడు గ్రామంలో జరిగిన ఓ పెళ్లి వేడుకలకు జబర్దస్త్ ఆర్టిస్టులు హాజరై సందడి చేశారు. గ్రామానికి చెందిన జయన్న కుమారుడు సురేష్ బాబు హైదరాబాదులో జబర్దస్త్ ఆర్టిస్టులకు స్క్రిప్ట్ రైటర్‌గా, అసిస్టెంట్ డైరెక్టర్ పని చేస్తున్నారు. శుక్రవారం జరిగిన ఇతని వివాహానికి జబర్దస్త్ టీం సభ్యులు హైపర్ ఆది, వెంకీ, అప్పారావు, నాగి, ఆర్‌పీసీ బాబు, మోహన్, తేజ, డైరెక్టర్ మనికంఠ, ఇమ్మానియేలు తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వీరితో సెల్ఫీలు దిగేందుకు యువకులు పోటీ పడ్డారు. చదవండి: (మళ్లీ ప్రేమలో పడ్డా)