డ్రంక్ అండ్ డ్రైవ్తో అనర్ధాలు: జబర్దస్త్‌ నటుడు | jabardasth actor venki says disparity with drunk and drive | Sakshi
Sakshi News home page

డ్రంక్ అండ్ డ్రైవ్తో అనర్ధాలు: జబర్దస్త్‌ నటుడు

Published Sun, Aug 13 2017 3:29 PM | Last Updated on Wed, Apr 3 2019 8:57 PM

డ్రంక్ అండ్ డ్రైవ్తో అనర్ధాలు: జబర్దస్త్‌ నటుడు - Sakshi

డ్రంక్ అండ్ డ్రైవ్తో అనర్ధాలు: జబర్దస్త్‌ నటుడు

వరంగల్: వరంగల్ నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ జరిగింది. స్థానిక ఐఎంఏ హాలులో ఏసీపీ, ట్రాఫిక్ ఇన్చార్జి చైతన్య కుమార్ ఆధ్వర్యంలో ఈ కౌన్సలింగ్ నిర్వహించారు. 110 మందిపై కేసు నమోదు చేయగా ముగ్గురికి జైలు శిక్ష విధించారు. మొత్తం రూ. 1,35,700 జరిమానా వసూలు చేశారు.  ఈ కార్యక్రమంలో ‘జబర్దస్త్’  వెంకీ కూడా పాల్గొని డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల కలిగే అనర్ధాల గురించి వివరించారు.

సమాజంలో డ్రంక్ డ్రైవ్ కేసులు పెరిగిపోయాయి. మద్యం సేవించి డ్రైవింగ్ చేయటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్ని సందర్భాల్లో అమాయకులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు.  ఇందుకు ఉదాహరణ నగరంలో  సంవత్సరం క్రితం కొంత మంది యువకులు మద్యం సేవించి డ్రైవ్ చేయటం వల్ల ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.

ఈ ప్రమాదంలో ఒకే కుంటుంబానికి చెందిన చిన్నపాప రమ‍్యతోపాటు మూడు తరాల వ్యక్తులు  ప్రాణాలు కోల్పోయారు. తమకు జరిగిన అన్యాయం మరో కుటుంబానికి జరగకుండా ఉండాలంటే రమ్య యాక్ట్ తీసుకొచ్చి దోషులను కఠినంగా శిక్షించాలని రమ్య తండ్రి డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement