నటి, జబర్దస్త్ బ్యూటీ రీతూ చౌదరి సోషల్ మీడియాలో చేసే హడావుడి మామూలుగా ఉండదు. ఎప్పటికప్పుడు తన ఫోటోషూట్ పిక్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ అభిమానులతో టచ్‌లో ఉంటుందీ బ్యూటీ. మరోపక్క బుల్లితెరపైనా పలు షోలలో కనిపిస్తూ కామెడీ పంచులతో అలరిస్తోంది. అలాగే తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వ్యక్తిగత విషయాలను సైతం పంచుకుంటూ ఉంటుంది. ఆ మధ్య రీతూ చౌదరి లవ్‌లో పడిందంటూ ఓ వార్త తెగ వైరలయింది.
శ్రీకాంత్ అనే వ్యక్తితో కలిసి దిగిన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఈ బంధం కంటే ఏదీ గొప్పది కాదని రాసుకొచ్చింది. దీంతో రీతూ-శ్రీకాంత్ లవ్‌లో ఉన్నారని కన్ఫామ్ అయిపోయింది. రీతూ నుదుటన శ్రీకాంత్ ముద్దు పెట్టిన వీడియో కూడా వైరల్ అయింది. వీరిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారంటూ ఆ మధ్య ఫోటో కూడా లీకైంది. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ వీళ్లిద్దరూ మళ్లీ కలిసి కనిపించనేలేదు. రీతూ తండ్రి చనిపోయినప్పుడు కూడా శ్రీకాంత్ ఆమెను ఓదార్చడానికి రాలేనట్లు తెలుస్తోంది. పైగా రీతూ.. అతడితో కలిసి దిగిన ఫోటోలను సైతం డిలీట్ చేసింది. దీంతో వీళ్లు అసలు కలిసే ఉన్నారా? విడిపోయారా? అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.
తాజాగా ఈ అనుమానాలకు తెర పడింది. ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో 'నిజాలు మాట్లాడుకుందాం' అంటూ చిట్‌చాట్ నిర్వహించిన ఆమె.. ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చింది. పెళ్లెప్పుడు? అన్న ప్రశ్నకు అసలు పెళ్ళి చేసుకోకపోవడమే మంచిది, అప్పుడే సంతోషంగా ఉండొచ్చు అని రిప్లై ఇచ్చింది. శ్రీకాంత్‌తో మాట్లాడట్లేదా? అని అడగ్గా లేదన్నట్లుగా తలాడిస్తూ త్వరలోనే వివరంగా చెప్తానంది. ఎవరినైనా లవ్ చేస్తున్నారా? అన్న ప్రశ్నకు 'లవ్వుకో దండం.. నేను నాతో మాత్రమే ప్రేమలో ఉన్నాను' అని చెప్పుకొచ్చింది. దీంతో రీతూ బ్రేకప్ నిజమేనని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
#Rithu x #Srikanth pic.twitter.com/raIL6cXxDA
— Hardin (@hardintessa143) July 16, 2022
Comments
Please login to add a commentAdd a comment