జబర్దస్త్ ఫేమ్‌ నరేష్ టీమ్‌పై దాడి | Attack on Jabardasth naresh team in Srikakulam | Sakshi
Sakshi News home page

జబర్దస్త్ ఫేమ్‌ నరేష్ టీమ్‌పై దాడి

Published Sun, Feb 10 2019 8:48 AM | Last Updated on Thu, May 16 2019 12:08 PM

Attack on Jabardasth naresh team in Srikakulam - Sakshi

సాక్షి, శ్రీకాకుళం : జబర్దస్త్ ఫేమ్‌ నరేష్ డ్యాన్స్ టీమ్‌పై శ్రీకాకుళం చిన్నబరాటం వీధికి చెందిన యువకులు దాడి చేశారు. గ్రీన్ రూమ్‌లోకి తొంగి చూడటాన్ని బౌన్సర్‌లు అడ్డుకోవడంతో వివాదం చెలరేగింది. దీంతో నరేష్ బృందం తిరుగుప్రయాణం అయ్యాక మార్గమధ్యలో కొందరు స్థానిక యువకులు వాహనాలపై దాడికి పాల్పడ్డారు. అక్కడున్న వారు దాడికి పాల్పడిన ఓ యువకుడిని పట్టుకొని టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. కళింగాంధ్రా ఉత్సవాల్లో ప్రోగ్రాం ముగించుకొని వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దాడికి కారణమైన వాళ్లని అరెస్ట్ చేయాలని జిల్లా కలెక్టర్ పోలీసులను అదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement