‘జబర్దస్త్’ శేషుకు గాయాలు
హైదరాబాద్: జబర్దస్త్ ప్రోగ్రామ్ కామెడీయన్ షేకింగ్ శేషు గాయాలపాలయ్యాడు. రాజస్థాన్లో జరుగుతున్న ఓ సినిమా షూటింగ్లో భాగంగా కారు చేజింగ్ సీన్లో అతడు గాయపడినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో శేషు ఎడమ చేతికి గాయమైంది. ప్రస్తుతం శేషు నగరంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా షేకింగ్ శేషుగా అతడు పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.