Rithu Chowdary Shares Photo With Srikanth - Sakshi
Sakshi News home page

Rithu Chowdary: రీతూ బ్రేకప్‌ ఉత్తిదేనా? శ్రీకాంత్‌తో కలిసి దిగిన ఫోటోను షేర్‌..

Published Sat, Aug 19 2023 10:46 AM | Last Updated on Sat, Aug 19 2023 11:13 AM

Rithu Chowdary Share Photo With Srikanth - Sakshi

జబర్దస్త్‌ బ్యూటీ రీతూ చౌదరి ఈ మధ్య గ్లామర్‌ను తెగ ఒలకబోస్తోంది. ఇటు వెస్ట్రన్‌, అటు ట్రెడిషనల్‌ గెటప్‌లో ఫోటోషూట్‌ చేస్తూ అభిమానులకు డబుల్‌ ట్రీట్‌ ఇస్తోంది. రీతూ అందాన్ని చూసి అభిమానులు తెగ ముచ్చటపడిపోతున్నారు. మా రీతూ హీరోయిన్‌కు ఏమాత్రం తక్కువ కాదనేవాళ్లూ ఉన్నారు. 

తండ్రి చనిపోయిన బాధలో నుంచి తేరుకుని ఇప్పుడిప్పుడే తిరిగి మామూలు మనిషవుతున్న రీతూ గతంలో శ్రీకాంత్‌ అనే వ్యక్తితో లవ్‌లో ఉన్నట్లు వార్తలు వైరలయ్యాయి. వీరిద్దరూ కలిసి రీల్స్‌ చేస్తూ తెగ హల్‌చల్‌ చేసేవారు. అతడితో బంధం ఎంతో గొప్పదని కూడా రీతూ పేర్కొంది. ఈ ముద్దుగుమ్మ నుదుటన శ్రీకాంత్‌ ముద్దు పెట్టిన వీడియో సైతం నెట్టింట చక్కర్లు కొట్టింది. దీంతో వీరి లవ్వు నిజమేనని అంతా అనుకున్నారు. రీతూకు ఓ తోడు దొరికేసిందని అభిమానులు అభిప్రాయపడ్డారు. కానీ ఇటీవల రీతూ తనకు బ్రేకప్‌ అయిందంటూ హింట్‌ ఇచ్చింది.

గత నెలలో ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో జరిపిన చిట్‌చాట్‌లో తాను సింగిల్‌గా ఉన్నట్లు వెల్లడించింది. అంతేకాదు, ప్రేమకు, పెళ్లికో దండం.. ప్రస్తుతం తాను తనతో మాత్రమే ప్రేమలో ఉన్నానని చెప్పుకొచ్చింది. అసలు పెళ్లి చేసుకోకపోతేనే సంతోషంగా ఉండొచ్చు అని పేర్కొంది. శ్రీకాంత్‌తో మాట్లాడట్లేదని కూడా తెలిపింది. దీంతో వీరి బ్రేకప్‌ నిజమేననుకున్నారంతా! ఇంతలో సడన్‌ షాకిస్తూ తాజాగా శ్రీకాంత్‌తో కలిసి దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. తనను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తారనుకుందో ఏమో కానీ ఆ పోస్ట్‌కు కామెంట్లు కనిపించకుండా పెట్టింది. అసలు గీతూ ఇప్పుడు సింగిలా? కాదా? అనేది తెలియాలంటే తను క్లారిటీ ఇచ్చేవరకు ఆగాల్సిందే!

చదవండి: 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement