నటి, లేడీ కమెడియన్ రీతూ చౌదరి తండ్రి ఇటీవలే మరణించిన విషయం తెలిసిందే! నిత్యం తండ్రిని తలుచుకుంటూ సోషల్ మీడియాలో బాధతో నిండిన పోస్టులు పెడుతోంది రీతూ. ఆయన జ్ఞాపకాలతోనే ఈ జీవితమంతా బతికేస్తా అంటూ ఎమోషనలవుతోంది. అయితే ఈరోజు మాత్రం సడన్‌గా పల్చటి చీర కట్టి తన అందాలు చూపిస్తూ నవ్వులు చిందిస్తూ ఓ రీల్ చేసింది. దీన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెటిజన్లు షాకయ్యారు. ఏంటక్కా ఇది? మొన్ననే కదా నాన్నని పోగొట్టుకున్నావు. ఆ బాధలో ఉండగా ఈ వీడియోలు ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు.
'నిన్ననే బాధతో పోస్టులు పెట్టావు, అప్పుడే గ్లామర్ షోనా?', 'ఛీ, నాన్న పోయిన బాధ కూడా లేదు..', 'నాన్న నాన్న అన్నావు.. అప్పుడే ఎక్స్‌పోజింగ్ వీడియోలు పెడుతున్నావు. మీరు నిజంగా దేవత.. మీలాంటివాళ్లు ఉండాలి.. తెలుగు అమ్మాయిలు ఎక్కడికి పోతున్నారో!', 'నాన్న చనిపోయారని అంత బాధపడ్డారు, అప్పుడే ఇంత సంతోషంగా కనిపిస్తున్నారు', 'ఏంటిదంతా? కనీసం 11 రోజుల దాకా కూడా ఆగలేవా?' అంటూ ఆగ్రహంతో కామెంట్లు చేస్తున్నారు. అయితే రీతూ ఫ్యాన్స్ మాత్రం.. తను డిప్రెషన్ నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తోంది. మీకంత బాధగా ఉంటే అన్‌ఫాలో అయిపోయిండి, తన వృత్తి అలాంటిది.. బాధలో ఉన్నా సంతోషంలో ఉన్నా.. యాక్టింగ్ చేయాల్సిందే! అది అర్థం చేసుకోకుండా ఎందుకలా నిందిస్తున్నారు? అని మండిపడుతున్నారు. ఈ రీల్ తన తండ్రి చనిపోకముందే చేసిందని, కాకపోతే కాస్త ఆలస్యంగా ఇప్పుడు పోస్ట్ చేసిందని రీతూను వెనకేసుకొస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment