
బెల్స్ పాల్సీ వ్యాధి వల్ల నేను ఎంత ఇబ్బందిపడ్డానో మీకు తెలుసు. మీ అందరి ప్రార్థనల వల్ల నేను మళ్లీ మామూలు మనిషినయ్యాను. నా భార్య అయితే ఆ భగవంతుడిని ప్రార్థించని రోజంటూ లేదు.
బెల్స్ పాల్సీ.. దీన్నే ఫేషియల్ పెరాలసిస్ అని కూడా అంటారు. ముఖంలో పక్షవాతంలా రావడంతో ఈ వ్యాధి చాలా ఆందోళనకు గురి చేస్తుంది. దీనివల్ల ముఖంలో ఒకవైపు కండరాలు సరిగా పని చేయవు. దీంతో ముఖం వంకరగా కనిపిస్తుంది. నవ్వినప్పుడు, మాట్లాడినప్పుడు ఈ వంకరదనం ఎక్కువగా కనిపిస్తుంది. మలయాళ నటుడు, యాంకర్ మిథున్ రమేశ్ కొంతకాలం క్రితం ఇదే వ్యాధితో బాధపడ్డాడు. ఆ సమయంలో ఆయనకు త్వరగా నయమైతే ఏడుకొండలు వచ్చి గుండు కొట్టించుకుంటానని మిథున్ భార్య లక్ష్మి.. తిరుపతి వెంకటేశ్వరస్వామికి మొక్కుకుంది.
గుండు గీయించుకున్న భార్య
ఈ వ్యాధి నుంచి మిథున్ దాదాపు బయటపడటంతో ఇటీవలే తిరుపతిలో తలనీలాలు సమర్పించుకుంది. తాను మొక్కుకున్నట్లుగానే గుండు గీయించుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను మిథున్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. 'బెల్స్ పాల్సీ వ్యాధి వల్ల నేను ఎంత ఇబ్బందిపడ్డానో మీకు తెలుసు. మీ అందరి ప్రార్థనల వల్ల నేను మళ్లీ మామూలు మనిషినయ్యాను. నా భార్య అయితే ఆ భగవంతుడిని ప్రార్థించని రోజంటూ లేదు.
ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు థ్యాంక్స్
ఈ వ్యాధి నుంచి బయటపడితే తలనీలాలు ఇస్తానని తిరుపతి దేవుడికి మొక్కుకుంది. ఇదిగో ఇప్పుడు ఆ మొక్కు తీర్చేసుకుంది. ఇంతకంటే ఆమెను నేను ఏమని అడిగాలి. ఇంతటి ప్రేమ, త్యాగం, నమ్మకం చూపిస్తున్నందుకు కృతజ్ఞతలు' అని రాసుకొచ్చాడు. ఈ పోస్ట్‌పై పలువురు సెలబ్రిటీలు స్పందిస్తూ మిథున్‌పై అతడి భార్యకు ఎంత ప్రేముందో అని కొనియాడుతున్నారు.
చదవండి: అందరూ హెచ్చరించారు.. క్షణాల్లో జరిగిపోయింది.. వీడియో రిలీజ్ చేసిన హీరోయిన్