మలయాళ హీరో ధ్యాన్ శ్రీనివాసన్ ఇటీవలే జైలర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ 'జైలర్' తమిళ మూవీ కాగా అదే టైటిల్‌తో మలయాళంలోనూ సినిమా వచ్చింది. అందులో జైలర్ శాంతారామ్‌గా నటించాడు ధ్యాన్. అయితే ఒకానొక సమయంలో తాను డ్రగ్స్‌కు బానిసై జీవితాన్ని నాశనం చేసుకున్నానని, దాన్నుంచి బయటపడ్డాకే తన జీవితం బాగుపడిందని చెప్తున్నాడు.
నాన్న సంపాదించింది నాకోసమేగా
తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. నాన్న శ్రీనివాసన్ దర్శకనటుడు, నిర్మాత. జనాలు నన్ను నెపో కింగ్ అని పిలిచేవారు. కాలేజీ డేస్‌లో నేను డ్రగ్స్‌కు అలవాటుపడ్డాను. నిజం చెప్పాలంటే బానిసయ్యాను. డ్రగ్స్ ఒక్కటే కాదు మద్యానికి సైతం బానిసనయ్యాను. పగలూరాత్రి తేడా లేకుండా తాగేవాడిని. కొన్ని నెలలపాటు అదే పనిగా తాగుతూనే ఉన్నాను. తాగి ఇంటికి వెళ్లిన ప్రతిసారి అమ్మ తిట్టేది. అప్పుడు నేను అర్పిత అనే అమ్మాయిని ప్రేమించాను కూడా! మా నాన్న చాలా సంపాదించాడు, అలాంటప్పుడు నేను పని చేయాల్సిన అవసరమేముంది, కేవలం దాన్ని ఖర్చు పెట్టే బాధ్యత మాత్రమే నా మీద ఉంది అని చెప్పాను.
మరికొద్ది గంటల్లో పెళ్లి పెట్టుకుని పేకాట
ఆ మత్తులో పిచ్చివాడిలా ప్రవర్తించేవాడిని. కన్నతండ్రినే తిట్టాను. ఒకసారైతే నన్ను ఇంట్లో నుంచి గెంటేశారు. అది నాకు పెద్దగా గుర్తులేదు కానీ నాకు మత్తు వదిలిన తర్వాత డ్రైవర్ ఆ విషయం చెప్పాడు. నాకు పేకాట కూడా అలవాటుంది. పెళ్లికి ముందు రోజు రాత్రి 9 గంటలకు నేను ఫుల్లుగా తాగి పేకాట ఆడాను. అర్పిత నాకు ఫోన్ చేసి ఇంటికి వెళ్తున్నావా? లేదా? అని సీరియస్‌గా అడిగేసింది. మేము 14 ఏళ్లుగా ప్రేమలో ఉన్నాం. కాబట్టి ఇదొక ఈవెంట్ అని లైట్ తీసుకున్నాను.
నేను చెడిపోయానని బాధపడ్డారు
తెల్లవారుజామున మూడు గంటలకు వెళ్లాను. స్నానం చేసి రెడీ అయ్యాక మళ్లీ తాగాను. పెళ్లిమండపంలోనూ కాస్త గోల చేశాను. ఆ రోజు రాత్రి కూడా పేకాడాను. నేను పూర్తిగా నాశనమయ్యానని మా కుటుంబం బాధపడింది. నాన్న బాధతో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఇలా డ్రగ్స్ వల్ల నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను. తర్వాతికాలంలో కొందరు మిత్రులు దాని వల్ల అనారోగ్యానికి గురవడం చూసి డ్రగ్స్ డేంజర్ అని అర్థమైంది. నాకు పాప పుట్టాక డ్రగ్స్, పేకాట వంటి అలవాట్లు పూర్తిగా మానేశాను' అని చెప్పుకొచ్చాడు.
చాలా చెడ్డ సినిమాలు చేశా
సినిమాల గురించి మాట్లాడుతూ.. 'నేను నటుడిని కావాలనుకోలేదు, డైరెక్టర్ అవ్వాలనుకున్నాను. అందుకే ఇప్పటికీ నన్ను నేను పార్ట్ టైం యాక్టర్‌గానే ఫీలవుతాను. సినిమా ఫ్లాప్ అయితే అందరూ ఫస్ట్ నటులనే తిడతారు. సినిమా అనేది కొంతమంది కలిసి చేసే పని. సినిమా సక్సెస్ కాకపోతే ముందుగా నిర్మాతను, తర్వాత డైరెక్టర్‌ను, ఆ తర్వాత నటీనటులను విమర్శించాలి. నేను చాలా చెడ్డ సినిమాలు చేశాను. ముందూవెనకా ఆలోచించకుండా మూవీస్ చేసేశాను, అవి వర్కవుట్ కావని కూడా ముందే చెప్పేవాడిని.
నటుడిగా మీకు కనిపించను
కేవలం నా ఫ్రెండ్స్ కోసమే అవన్నీ చేశాను. కెరీర్‌ను సరిగా ప్లాన్ చేసుకోవడం రాని నటుడిని నేను. అందుకే నేను చేసినవాటిలో చాలా సినిమాలు ఫ్లాపయ్యాయి. దయచేసి నా ఇంటర్వ్యూలు చూసి సినిమాలు చూడకండి. ఇంటర్వ్యూలు చూసి నన్ను ప్రేమిస్తున్నారు. కానీ థియేటర్ దగ్గర వస్తున్న టాక్‌ను బట్టే మీరు సినిమాకు వెళ్లండి. ఇంకా మీరు నన్ను రెండుమూడేళ్లు భరిస్తే చాలు. ఇప్పుడు నేను ఒప్పుకున్న సినిమాలు చేశాక మళ్లీ నటుడిగా మీకు కనిపించను. నేను సినిమాల్లో నటించడం మానేస్తాను' అని చెప్పుకొచ్చాడు ధ్యాన్ శ్రీనివాసన్.
చదవండి: కిరణ్ రాథోడ్ ఎలిమినేషన్‌కు ప్రధాన కారణాలివే! వారం రోజుల్లోనే అంత సంపాదించిందా?
Comments
Please login to add a commentAdd a comment