'అల వైకుంఠపురములో' నటుడికి నిశ్చితార్థం.. అమ్మాయి ఎవరంటే? | Actor Padma Soorya Gets Engaged With Actress Gopika Anil | Sakshi
Sakshi News home page

Padma Soorya: సీరియల్ హీరోయిన్‌తో సినిమా హీరో ఎంగేజ్‌మెంట్

Published Sun, Oct 22 2023 4:17 PM | Last Updated on Sun, Oct 22 2023 4:22 PM

Actor Padma Soorya Engagement With Actress Gopika Anil - Sakshi

మరో యంగ్ హీరో పెళ్లికి రెడీ అయ్యాడు. సీరియల్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదే టైంలో వీళ్ల ప్రేమ పెళ్లా, పెద్దల కుదిర్చిన సంబంధమా అని తెగ మాట్లాడుకుంటున్నారు.

(ఇదీ చదవండి: Bigg Boss 7: మాటలు మార్చి దొరికిపోయిన రైతుబిడ్డ.. ఫ్రూప్స్‌తో సహా మొత్తం!)

మలయాళ నటుడు పద్మ సూర్య.. సొంత ఇండస్ట్రీలో హీరోగా ఫేమ్ తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు. డాడీ కూల్, 72 మోడల్, ప్రేతమ్, ప్రేతమ్ 2 తదితర సినిమాల్లో హీరోగా నటించాడు. తెలుగులో 'అల వైకుంఠపురములో' చిత్రంలో విలన్ కొడుకుగా నటించాడు. ఇది కాకుండా బంగార్రాజు, మీట్ క్యూట్, లైక్ షేర్ సబ్‌స్క్రైబ్ చిత్రాల్లో సహాయ పాత్రలు చేశాడు. మరోవైపు టీవీ షోల హోస్ట్‌గానూ రాణిస్తున్నాడు.

నటుడిగా పేరు తెచ్చుకున్న పద్మసూర్య.. సీరియల్ బ్యూటీ గోపిక అనిల్‌తో నిశ్తితార్థం చేసుకున్నాడు. అయితే వీళ్లది పెద్దల కుదుర్చిన సంబంధమని స్వయంగా పద్మసూర్యనే సోషల్ మీడియాలో వెల్లడించాడు. ఇకపోతే జంట చూడచక్కగా ఉందని పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. అలానే డిసెంబరులో వీళ్ల పెళ్లి ఉండొచ్చని అంటున్నారు.

(ఇదీ చదవండి: అవార్డ్ విన్నింగ్ సౌత్ సినిమా.. రెండేళ్ల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement