
ప్రముఖ మలయాళ నటుడు టీపీ మాధవన్ (88) కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా క్షీణించడంతో మంగళవారం నాడు ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి కేరళ సీఎం పినరయి విజయన్ సహా పలువురు సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
సినిమా..
కాగా టీపీ మాధవన్ 40 ఏళ్ల వయసులో సినీ కెరీర్ ఆరంభించారు. దాదాపు 600 చిత్రాల్లో నటించారు. 2016లో వచ్చిన మాల్గుడి డేస్ సినిమాలో చివరిసారిగా నటించారు. వెండితెరతో పాటు బుల్లితెరపైనా సీరియల్స్‌లో విలన్, కమెడియన్, సహాయక నటుడిగా మెప్పించారు. మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ 'అమ్మ'కు మొట్టమొదటి జనరల్ సెక్రటరీగా పని చేశారు.
Comments
Please login to add a commentAdd a comment