ప్రముఖ నటుడిపై పోక్సో కేసు.. నాలుగేళ్ల పాపతో దారుణంగా! | Police Case On Malayalam Actor Koottickal Jayachandran | Sakshi
Sakshi News home page

Koottickal Jayachandran: నటుడిపై కేసు.. ప్రస్తుతం పోలీసుల అదుపులో!

Jun 10 2024 4:32 PM | Updated on Jun 10 2024 4:37 PM

Police Case On Malayalam Actor Koottickal Jayachandran

మలయాళీ ప్రముఖ నటుడు కూటికల్ జయచంద్రన్ పోక్సో కేసులో ఇరుక్కున్నాడు. తన నాలుగేళ్ల కూతురిని ఈ నటుడు లైంగికంగా వేధించాడని ఓ మహిళ.. కోజికొడ్‌లోని కసాబా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అలానే దీని నుంచి తప్పించుకునేందుకు మరో విషయం తెరపైకి తీసుకొచ్చాడని సదరు మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. అవి ఏంటంటే?)

మరోవైపు పోలీసులు.. ఇప్పటికే నాలుగేళ్ల చిన్నారి దగ్గరకెళ్లి ఆమె స్టేట్‌మెంట్ రికార్డ్ చేసుకున్నారు. అయితే ఆ చిన్నారి ఏం చెప్పింది అనే విషయాల్ని మాత్రం బయటపెట్టలేదు. అలానే నటుడు జయచంద్రన్‌ని అరెస్ట్ చేశారా లేదా అనేది కూడా తెలిసి రావట్లేదు. టీవీ ప్రోగ్రామ్స్, స్టేజీ ఫెర్ఫార్మెన్స్‌లతో గుర్తింపు తెచ్చుకున్న జయచంద్రన్.. రీసెంట్ టైంలో అయితే 'దృశ్యం 2' సినిమాలో నటించాడు.

(ఇదీ చదవండి: అనుమానాస్పద రీతిలో నటి మృతి.. పట్టించుకోని కుటుంబ సభ్యులు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement