
కరోనా ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్.. ఇలా ఏ తేడా లేకుండా అందరికీ సోకుతూ ఇండస్ట్రీని గడగడలాడిస్తోంది. ఇప్పటికే పలువురు స్టార్లు కరోనా బారిన పడగా తాజాగా మరో యంగ్ హీరోకు వైరస్ సోకింది. యంగ్ హీరో దుల్కర్ సల్మాన్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆయన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.
'నాకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఇంట్లోనే స్వీయనిర్బంధంలో ఉంటున్నాను. స్వల్ప కోవిడ్ లక్షణాలు మినహా అంతా బాగానే ఉన్నాను. గత కొద్ది రోజులుగా నన్ను కలిసిన వారందరూ ఐసోలేషన్‌లో ఉంటే మంచింది. ఈ మహమ్మారి మనల్ని ఇంకా వదిలిపెట్టలేదు. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి. మాస్కులు ధరించండి' అని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు. కాగా దుల్కర్ తండ్రి, మలయాళ స్టార్ మమ్ముట్టి సైతం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే! సంక్రాంతి రోజే తను కోవిడ్ ఉన్నట్లు తేలిందని సోషల్ మీడియాలో వెల్లడించాడు. వారం రోజుల వ్యవధిలోనే తండ్రీకొడుకులు కరోనా బారిన పడటంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment