మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన తాజా చిత్రం ‘సీతారామం’. మరాఠి భామ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించగా.. రష్మిక మందన్నా ప్రధాన పాత్ర పోషించింది. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య ఆగస్ట్ 05న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ క్రమంలో మూవీ సక్సెస్ నేపథ్యంలో ఓ చానల్‌తో ముచ్చటించాడు దుల్కర్ సల్మాన్.
చదవండి: లోకేశ్ కనకరాజు-విజయ్ చిత్రం, ‘విక్రమ్’ను మించిన స్క్రిప్ట్! అదిరిపోయిందిగా..
ఈ సందర్భంగా తన తండ్రి మమ్ముట్టి గురించి ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. తాను సినిమాల్లోకి వస్తానని చెబితే నాన్న బాధపడ్డారంటూ షాకింగ్ న్యూస్ చెప్పాడు. ఈ సందర్భంగా దుల్కర్ మాట్లాడుతూ.. ‘నేను సినిమాల్లోకి రావడం నాన్నకు ఇష్టం లేదు. అందువల్లనే ఫైట్లు, డాన్స్‌లు నేర్పించలేదు. ఆయన చెప్పినట్టుగానే చదువుకుని దుబాయ్‌లో కొంతకాలం ఉద్యోగం చేశాను. కానీ నాలుగు గోడల మధ్య ఉద్యోగం చేయడం నా వల్ల కాలేదు. అందువల్లనే కేరళకి తిరిగి వచ్చేశాను. హీరోగా ట్రై చేస్తానని నాన్నతో చెప్పాను. అప్పుడు ఆయన చాలా బాధపడ్డారు’ అంటూ చెప్పుకొచ్చాడు.
చదవండి: ఆ విషయంలో టాలీవుడ్ గ్రేట్: తమిళ నిర్మాత రాజన్
ఆ తర్వాత ఈ విషయంలో ఇంట్లో పెద్ద గొడవే జరిగిందన్నాడు. ‘నేను సినిమాల్లోకి వెళతానని చెప్పాగానే నాన్న పెద్ద గొడవ చేశారు. అంతకుముందు ఆయనను ఎప్పుడూ అంత కోపం, బాధతో చూడలేదు. హీరోగా చేస్తానని చెప్పగానే నువ్వు ఎప్పుడూ సరదాగా డాన్స్ చేసింది లేదు.. నటించేందుకు నువ్వు ప్రయత్నించడం కూడా నేనేప్పుడు చూడలేదు. యాక్టింగ్ అంటే నువ్వు అనుకున్నత సులువు కాదు. అది నీవల్ల కాదు. నా పరువు తీసే ఆలోచన చేయకు’ అని చివాట్లు పెట్టారని చెప్పాడు. తాను నటిస్తానంటే వద్దని చెప్పిన ఆయనే ఇప్పుడు తన సినిమాలు చూసి సూచనలు ఇస్తుంటారని దుల్కర్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment